Congress President: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ దూరం.. నెల రోజుల్లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యేనా?
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక కొనసాగుతోంది. ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ తిరిగి ఆ పదవి చేపట్టేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు మళ్లీ ఈ బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ కూడా నిరాకరించారు.

Congress President: కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాహుల్ గాంధీ నిరాకరించారు. ఆయన ఈ పదవి చేపట్టేలా ఒప్పించేందుకు కాంగ్రెస్ కీలక నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో పార్టీ అధ్యక్షుడి వేట కాంగ్రెస్‌కు సవాలుగా మారింది. కాంగ్రెస్ పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం గత ఏడాది అక్టోబర్‌లోనే ప్రణాళిక మొదలైంది.
Tejashwi Yadav: కొత్త కార్లు కొనొద్దు.. అందరికీ నమస్కరించండి.. మంత్రులకు తేజస్వి యాదవ్ సూచన
దీని ప్రకారం ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 20 లోపు అధ్యక్షుడి ఎంపిక పూర్తవ్వాలి. ప్రస్తుతం అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ.. మరోసారి ఈ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా లేరు. ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున తిరిగి పదవి చేపట్టేందుకు ఇష్టపడటం లేదు. గతంలోనే రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపట్టారు. అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత ఆయన ఈ పదవికి రాజీనామా చేశారు. అప్పట్లో కీలక నేతలు ఒత్తిడి చేయడంతో మరోసారి సోనియా గాంధీ ఆ బాధ్యతలు తీసుకున్నారు. మధ్యలో పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యల కారణంగా పదవికి రాజీనామా చేసేందుకు ప్రయత్నించారు.
Revanth Reddy: తెలంగాణ ఆకాంక్షలను గుర్తించింది కాంగ్రెస్సే: రేవంత్ రెడ్డి
కానీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోరిక మేరకు పదవిలో కొనసాగారు. ప్రస్తుతం అధ్యక్ష పదవి చేపట్టనప్పటికీ, కాంగ్రెస్ పార్టీని తెరవెనుక రాహుల్ గాంధీయే నడిపిస్తున్నారు. బీజేపీపై పోరులో ముందుంటున్నారు. వచ్చే నెల నుంచి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో ఇది సాగనుంది. రాహుల్ కాదనడంతో ఆ పదవిని ప్రియాంకా గాంధీకి అప్పగించాలని కూడా కొందరు నేతలు భావిస్తున్నారు. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం చెందడంతో ప్రియాంక కూడా ఆ పదవి చేపట్టే అవకాశాలు లేవు. దీంతో కొత్త అధ్యక్షుడి కోసం పార్టీ కసరత్తు కొనసాగుతోంది.
#BoycottLiger : ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న బాయ్‌కాట్ లైగర్.. లైగర్ టాలీవుడ్ సినిమా కాదా??
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ముందుగా నిర్ణయించినట్లుగా వచ్చే నెల 20లోపు కొత్త అధ్యక్షుడి ఎంపిక పూర్తవుతుందా అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ సారి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా వచ్చే ఎన్నికల్లో విజయం వైపు కాంగ్రెస్ పార్టీని నడిపించాల్సి ఉంటుంది.