భోపాల్ విజేత ఎవరు..దిగ్విజయ్ వర్సెస్ సాధ్వి

  • Published By: venkaiahnaidu ,Published On : April 17, 2019 / 04:12 PM IST
భోపాల్ విజేత ఎవరు..దిగ్విజయ్ వర్సెస్ సాధ్వి

Updated On : April 17, 2019 / 4:12 PM IST

 మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సాధ్వి ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ పేరు ఖారారైంది.బుధవారం(ఏప్రిల్-17,2019)ఉదయం బీజేపీ సీనియర్ నేతలను కలిసి ఆమె ఆ పార్టీలో చేరారు.అయితే ఈ రోజు మధ్యాహ్నామే మధ్యప్రదేశ్ లోని నాలుగు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ అందులో  భోపాల్ అభ్యర్థిగా సాధ్విని ఎంపిక చేసింది.సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ అభ్యర్థిగా భోపాల్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.దీంతో భోపాల్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈసారి గట్టి పోటీ ఉండనుంది.

భోపాల్‌ బీజేపీకి కంచుకోట. 1989 నుంచి బీజేపీ అభ్యర్థులు ఈ స్థానం నుంచి విజయకేతనం ఎగురవేశారు. అయితే ఈసారి భోపాల్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ దిగ్విజయ్‌ను బరిలోకి దింపింది. దీంతో ఈ ఎన్నికను ప్రతిష్థాత్మకంగా తీసుకున్న బీజేపీ.. బలమైన అభ్యర్థి కోసం అన్వేషించింది. ఈ సమయంలో మొదట ఉమాభారతి, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ పేర్లు కూడా వినిపించాయి. చివరకు సాధ్వి పేరును బీజేపీ ఫైనల్ చేసింది.