రియల్లీ గ్రేట్.. బస్సు కండక్టర్ పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం.. తనకొచ్చే ఆదాయంలో 40శాతం దానికే ఖర్చు
తమిళనాడు రాష్ట్రం కోవై బస్ కండక్టర్ మారిముత్తు యోగనాథన్(52) ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు. దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఏకంగా ప్రధాని మోదీతో శభాష్ అనిపించుకున్నాడు. ప్రధానితో ప్రశంసలు పొందాడు.

Marimuthu Yoganathan
Marimuthu Yoganathan : తమిళనాడు రాష్ట్రం కోవై బస్ కండక్టర్ మారిముత్తు యోగనాథన్(52) ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు. దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఏకంగా ప్రధాని మోదీతో శభాష్ అనిపించుకున్నాడు. ప్రధానితో ప్రశంసలు పొందాడు. మన్ కీ బాత్ లో కండక్టర్ యోగనాథన్ పై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ యోగనాథన్ ఏం చేస్తున్నారో తెలుసా.. బస్సు టికెట్ తో పాటు ప్రయాణికులకు మొక్కలు కూడా ఇస్తున్నారు. తనకొచ్చే ఆదాయంలో 40శాతం మొక్కలు నాటేందుకు ఖర్చు పెడుతున్నారు.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కండక్టర్ యోగనాథన్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. కండక్టర్ యోగనాథన్ ప్రయాణికులకు టికెట్‌తోపాటు మొక్కలను అందజేస్తున్నారని, తన ఆదాయంలో అధిక భాగాన్ని ఇందుకోసం వినియోగిస్తుండడం ప్రశంసనీయం అని మోదీ అన్నారు.
ఏకంగా ప్రధాని మోదీ ప్రశసించడతో యోగనాథన్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మోదీ తనను ప్రశంసించడం సంతోషంగా ఉందన్నాడు. అంతేకాదు మరింత ప్రోత్సాహకరంగా ఉందన్నాడు. తనలా ఎందరో మొక్కలను నాటే పనుల్లో నిమగ్నమవుతారని చెప్పాడు. కాగా, తనకు వచ్చే ఆదాయంలో 40 శాతాన్ని మొక్కలు నాటేందుకు ఖర్చు పెడుతున్నట్లు యోగనాథన్ తెలిపాడు. 34 ఏళ్లుగా కండక్టర్‌గా పనిచేస్తున్న తాను ఇంతవరకు మూడు లక్షలకు పైగా మొక్కలను నాటినట్లు తెలిపాడు. గత ఏడాది(2020) 85 వేల మొక్కలను ఉచితంగా పంపిణీ చేసినట్లు చెప్పాడు. యోగనాథన్ ఇప్పటి వరకు అనేక అవార్డులను అందుకున్నాడు. సీబీఎస్‌ఈ 5 తరగతి పాఠ్యాంశంలోనూ యోగనాథన్ చోటు దక్కించుకున్నాడు.
ఇంత చేస్తున్న యోగనాథన్ బాగా రిచ్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. అతడిది మధ్య తరగతి కుటుంబం. నెల నెల వచ్చే జీతమే ఆధారం. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాడు. నెల నెల వచ్చే జీతంతోనే భార్య, ఇద్దరు కూతుళ్లను పోషిస్తున్నాడు. ఆ జీతం డబ్బుతోనే ఎంతో గొప్ప పని చేస్తున్నాడు. ఈ రోజుల్లో పక్కోడికి ఒక్క రూపాయి ఇవ్వాలన్నా తెగ ఆలోచిస్తారు. లాభాం లేకుండా ఏ పనీ చెయ్యరు. అలాంటిది.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తనకొచ్చే ఆదాయంలో 40శాతం మొక్కల కోసం ఖర్చు చెయ్యడం అంటే మామూలు విషయం కాదని, అతడు రియల్లీ గ్రేట్ అంటున్నారు జనాలు. అంతేకాదు.. ట్రీ మ్యాన్ గా బాగా పాపులర్ అయ్యాడు యోగనాథన్.