Viral Video : పెళ్లికొడుకు మెడలో కరెన్సీ నోట్ల దండ.. ఎన్ని లక్షల నోట్లో తెలుసా?
ఇటీవల కాలంలో వింత ప్రదర్శనలు ఇస్తూ చాలామంది వైరల్ అవుతున్నారు. ఓ పెళ్లికొడుకు మెడలో భారీ కరెన్సీ నోట్ల దండతో కనిపించాడు. ఆ దండలో ఎన్ని లక్షల విలువైన కరెన్సీ నోట్లు ఉన్నాయో తెలిస్తే షాకవుతారు.

Viral Video
Viral Video : ఓ పెళ్లి కొడుకు కరెన్సీ నోట్ల దండతో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూ.500 నోట్లతో తయారు చేసిన ఈ దండలో ఎంత విలువైన కరెన్సీ నోట్లు ఉన్నాయో తెలుసా?
Suresh Raina: రైనా, ఓజాకు ధోని విందు.. సాక్షి వెరైటీ ఎక్స్‌ప్రెషన్ వైరల్
ఇటీవల ఓ పెళ్లికొడుకు తన పెళ్లిలో కరెన్సీ నోట్ల దండతో కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రూ.20 లక్షల విలువైన రూ.500 నోట్లతో ఈ దండను తయారు చేసారట. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పెళ్లికొడుకు కరెన్సీ నోట్ల దండను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. dilshadkhan_kureshipur అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లలో కొందరు అతని సంపదను చూసి ఔరా అని ముగ్ధులైతే.. మరికొందరు ఇంత విపరీతమైన ప్రదర్శన అవసరమా? అని కూడా తిట్టుకున్నారు. ఇంకా కొందరైతే ఆ నోట్లు నిజమైనవి కాకపోవచ్చు కూడా అని అనుమానం వ్యక్తం చేసారు.
Shah Rukh Khan : అంబానీ ఇంట సెలబ్రేషన్స్‌లో.. పాములతో షారుఖ్ ఆటలు.. వీడియో వైరల్..
వీడియోలో ఇంటి పై గోడ మీద నిలబడ్డ వరుడి మెడలో వేసిన కరెన్సీ నోట్ల దండ కిందవరకూ వేలాడుతూ కనిపించింది. వివాహ వేడుకల్లో ఇలా ఇప్పటివరకు ఎవరూ ఆకట్టుకుని ఉండకపోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన వీడియో ప్రకారం హర్యానాలోని ఖురేషిపూర్ గ్రామానికి చెందినదిగా భావిస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అనేది నిర్ధారణ కాలేదు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వివాహ వేడుకల్లో కరెన్సీ నోట్ల దండను వేయడం కొందరి ఆచారం. అయితే కొందరు మాత్రం ఇలా ధరించడాన్ని సంపదను అగౌరపరచడంగా భావిస్తారు. మొత్తానికి లక్షల రూపాయలు కరెన్సీ నోట్ల దండ వేసుకున్న వరుడి వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram