Viral Video: ఉచిత ఆర్టీసీ బస్సులో కాదు.. విమానంలో పిండి కలుపుతూ ఇంటి పని చేసుకున్న మహిళ
తన వెంట తెచ్చుకున్న ఉప్పుతో పాటు బ్రెడ్ తయారీకి కావాల్సిన అన్ని పదార్థాలను ఆమె కలిపింది.

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళల్లో కొందరు అందులోనే టైమ్ పాస్ కోసం పలు పనులు చేస్తూ కనపడుతున్న వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇటీవలే ఇద్దరు మహిళలు హన్మకొండ నుంచి సిద్ధిపేట వెళ్లిన ఆర్టీసీ బస్సులో వెల్లుల్లి పొట్టు కూడా తీయడం అందరినీ ఆశ్చర్యపర్చింది.
తాజాగా, విమానంలోనూ ఇటువంటి పనులే చేసి ఓ మహిళ అందరినీ విస్మయానికి గురి చేసింది. లీఫ్యాండ్లోఫ్కో పేరిట ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ మహిళ ప్రతిరోజు బేకరీ ఐటమ్స్ తయారు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంది. ఆమె వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి.
ఆ మహిళ విమానంలో సీట్లో కూర్చొని అక్కడే పిండి కలిపుతూ వీడియో తీసుకుంది. ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ఇది విపరీతంగా వైరల్ అయింది. తన సోదరిని సర్‌ప్రైజ్ చేయడానికి ఇలా విమానంలో పిండి కలిపి తీసుకువెళ్తున్నానని ఆమె రాసుకొచ్చింది. పిండి ఇలా కలపాలని తన ఫాలోవర్లకు ఆమె వివరించి చెప్పింది.
స్పెయిన్‌కు వెళ్లే విమానంలో సోర్‌డోఫ్ బ్రెడ్ తయారు చేస్తున్నానని చెప్పింది. తన వెంట తెచ్చుకున్న ఉప్పుతో పాటు బ్రెడ్ తయారీకి కావాల్సిన అన్ని పదార్థాలను ఆమె కలిపింది. ఆమె విమానంలో పిండి కలపడం పట్ల తీవ్ర విమర్శలు రావడంతో చివరకు ఆమె ఇన్‌స్టాలో సారీ చెప్పింది.
View this post on Instagram
Also Read : ఈ ఆగస్టు 2024లో బెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఫోన్లు ఇవే.. ఓసారి లుక్కేయండి..!