వాట్సాప్ పుణ్యమే: 20 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిశాడు

సోషల్ మీడియా పుణ్యమా అంటూ కలుసుకుంటున్నారు. రాజస్థాన్ కి చెందిన మహవీర్ సింగ్ చౌహన్ ని  (48) ఓ వాట్సాప్ మెసేజ్ ద్వారా 20 ఏళ్ల తర్వాత తన కుటుంబసభ్యులతో కలిపింది.

  • Published By: veegamteam ,Published On : January 7, 2019 / 07:57 AM IST
వాట్సాప్ పుణ్యమే: 20 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిశాడు

Updated On : January 7, 2019 / 7:57 AM IST

సోషల్ మీడియా పుణ్యమా అంటూ కలుసుకుంటున్నారు. రాజస్థాన్ కి చెందిన మహవీర్ సింగ్ చౌహన్ ని  (48) ఓ వాట్సాప్ మెసేజ్ ద్వారా 20 ఏళ్ల తర్వాత తన కుటుంబసభ్యులతో కలిపింది.

ప్రస్తుత రోజుల్లో సొషల్ మీడియా ఎంత ప్రభావంగా పనిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలోని ఏ దేశంలోని మారుమూల వ్యక్తితో నైనా ప్రజలు పరిచయాలు పెంచుకుటున్నారు. తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అంతేకాకుండా ఎప్పుడో తప్పిపోయిన వారు కూడా సోషల్ మీడియా వేదికగా కలుసుకుంటున్నారు. రాజస్థాన్ కి చెందిన మహవీర్ సింగ్ చౌహన్  (48) ను ఓ వాట్సాప్ మెసేజ్.. 20 ఏళ్ల తర్వాత తన కుటుంబసభ్యులతో కలిపింది.

రాజస్థాన్ లోని జలోర్ జిల్లాలోని జబ్ గ్రామానికి చెందిన మహవీర్ సింగ్ చౌహాన్ ముంబైలో వ్యాపారం చేసి తీవ్రంగా నష్టపోయాడు. వ్యాపారం కోసం చేసిన అప్పులు తీర్చలేక 1998లో ఇళ్లు వదిలి పారిపోయాడు. దీంతో మహవీర్ తండ్రి పోలీసు కంప్లెయింట్ ఇచ్చి అతడి కోసం వెతుకులాట ప్రారంభించాడు. దాదాపు ఐదేళ్ల పాటు మహవీర్ కోసం గాలింపు చేపట్టారు. అయితే మహవీర్ బెంగళూరు వెళ్లి 20 ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నాడు. అయితే ఈ సమయంలో శనివారం(జనవరి5,2019) బెంగళూరు శివార్లలోని దొడ్డబల్లాపూర్ లో ఓ గులాబీ తోట దగ్గర సృహ తప్పి పడి ఉండటంతో మహవీర్ స్నేహితులు అతడిని రవి, కిషోర్ లు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మహవీర్ వెన్నముకకు గాయం అయిందని అతడిని నిమ్హాన్స్ హాస్పిటల్ కు తరలించాలని డాక్టర్లు సూచించారు.

ఈ సమయంలో మహవీర్ కుటుంబసభ్యులు అతని పక్కన ఉంటే ఆయన కోలుకొనే అవకాశం ఉందని భావించారు. వెంటనే మహవీర్ ఫొటోలను వాట్సాప్ లో సర్క్యులేట్ చేశారు. మహవీర్ డ్రైవింగ్ లైసెస్స్ లోని అడ్రస్ అధారంగా రాజస్థాన్ లోని వాట్సాప్ గ్రూప్ లకు ఫొటోలు షేర్ అయ్యాయి. శనివారం సాయంత్రం 6గంటలకల్లా మహవీర్ స్నేహితుడు కిషోర్ కి రాజస్థాన్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ ఫోన్ కాల్ చేసింది మహవీర్ కొడుకు ప్రద్యుమ్నన్. కువజామున ఫ్లైట్ కి బెంగళూరుకి బయల్దేరాడు ప్రద్యుమ్నన్. ప్రద్యుమ్నన్ రాకకోసం కిషోర్, రవిలతో పాటు వందలాంది మంది రాజస్థానీ కమ్యూనిటీ ప్రజలు నిమ్హాన్స్ హాస్పిటల్ వేచి ఉన్నారు. అయితే మహవీర్ కి మాత్రం ఇదంతా తెలియదు. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రద్యుమ్నన్ తన తండ్రి పాదాలను తాకిన క్షణంలో అందరూ భావోద్వేగానికి లోనయ్యారు. కొడుకు నాలుగేళ్ల వయస్సు ఇన్నప్పుడు ఇళ్లు వదిలి వెళ్లిపోయిన మహవీర్ 20 ఏళ్ల తన కొడుకుని గట్టిగా హగ్ చేసుకొని ముద్దులు పెట్టిన క్షణంలో అక్కడున్నవారందరి కళ్లల్లో ఆనందంతో కూడిన కన్నీళ్లు వచ్చాయి. 

 ఇదంతా తా నమ్మకలేకపోతున్నానని, ఇక జీవితంలో తిరిగిరాడనుకున్న తండ్రిని కలుసుకోగలిగానని ప్రద్యుమ్నన్ అన్నారు.  ఎప్పటికైనా మీ నాన్న ఒక రోజు తిరిగి వస్తాడని తన తల్లి తనతో చెప్పేదని ప్రద్యుమ్నన్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నాం మహవీర్ ను అపోలో హాస్పిటల్ కు తరలించామని, ఆయన కోలుకున్న తర్వాత రాజస్థాన్ కి తీసుకెళతామని ప్రద్యుమ్నన్ తెలిపారు.,