జనవరి 30 నుంచి ఏపీ అసెంబ్లీ

అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు జనవరి 30 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 30 వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. 30న గవర్నర్ ప్రసంగం, 31న మృతి చెందిన శాసనసభ్యులకు సంతాపం ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు సెలవు ప్రకటించి…4వ తేదీ నుంచి సమావేశాలను తిరిగి ప్రారంభించనున్నారు. 5న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి….7న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు.