ఐదేళ్ల పాలనలో రాజధానిలో ఏం చేశారు?
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఐదేళ్ల పాలనలో రాజధానిలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఐదేళ్ల పాలనలో రాజధానిలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ప్రెస్ ముందుకు రాకుండా కొత్త రకంగా ట్వీట్ లు చేస్తున్నారని తెలిపారు. రాజధానిని పవిత్ర దేవాలయం అంటున్న వారు ఐదేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. వేల కోట్లు అప్పులు చేశారు.. రాజధానిలో ఏ సంపద సృష్టించారని అడిగారు. 4 శాతం నిధులు మాత్రమే రాజధాని నిర్మాణానికి ఖర్చు చేశారని తెలిపారు. ఐదేళ్లలో చంద్రబాబు ఏం చేశారో ఆధారాలతో సహా చూపిస్తామన్నారు.
ఐదేళ్ల పాలనలో చంద్రబాబు రాజధానిలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో అమరావతిలో కేవలం నాలుగు భవనాలు మాత్రమే నిర్మించారని విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో 35 వేల ఎకరాల భూమిని లాగేసుకున్నారని మండిపడ్డారు. నాలుగు బిల్డింగ్‌లు 70 శాతం కట్టేందుకే రూ.4 వేల 900 కోట్లు ఖర్చు అయ్యాయా అని చంద్రబాబును ప్రశ్నించారు.
చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం ఒరిగిందో చెప్పాలని, చంద్రబాబు విధానాలు నచ్చకనే ప్రజలు ఆయనను ఇంట్లో కూర్చోబెట్టారని విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలే ఇసుకను దోచుకుతిన్నారని విమర్శించారు. ప్రభుత్వం పైన బురద చల్లుతున్నారని మండిపడ్డారు.