వైసీపీలో చేరిన బీజేపీ మాజీ ఎంపీ కుమారుడు

ఏపీ బీజేపీకి భారీ దెబ్బ తగిలింది. పశ్చిమ గోదావరిజిల్లా నర్సాపురం మాజీ ఎంపీ బీజేపీ నేత గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీలో చేరారు. గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు, గంగరాజు సోదరులు పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో సోమవారం వైసీపీ లో చేరారు. సీఎం జగన్ వారికి పార్టీ కండువా కప్పి అహ్వనించారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు, గోకరాజు గంగరాజు సోదరులు నరసింహరాజు, రామరాజు#YSRCP #APCMYSJagan pic.twitter.com/oGWxqwgnTL
— YSR Congress Party (@YSRCParty) December 9, 2019