టీడీపీకి ఈసీ లేఖ : హరిప్రసాద్ ను పంపడంపై అభ్యంతరం

టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. చంద్రబాబు లేవనెత్తిన అంశాలపై ఈసీ వివరణ ఇచ్చింది. టీడీపీ తరపున టెక్నికల్ టీమ్ హరిప్రసాద్ ను పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. హరిప్రసాద్ కాకుండా ఇతర టెక్నికల్ టీమ్ తో చర్చించేందుకు సిద్ధమని చెప్పింది. ఏప్రిల్ 15న ఉదయం 11 గంటలకు ఈసీని కలవచ్చని తెలిపింది.
హరిప్రసాద్ గతంలో బీహెచ్ ఈఎల్ లో ఉద్యోగిగా పని చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని 2010లో ప్రూవ్ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది కాబట్టే టీడీపీ ఓడిపోయిందని తెలిపారు. ఆ సమయంలో హరిప్రసాద్ పై కేసు నమోదు అయింది. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ప్రూవ్ చేయడానికి ఈవీఎం ఎక్కడి నుంచి వచ్చిందని ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎక్కడి నుంచి దొంగిలించి ఇది ప్రూవ్ చేశారన్న అంశానికి సంబంధించి ఏప్రిల్ 13 శనివారం టీడీపీ ఎంపీ రవీంద్ర కుమార్ కు ఈసీ ముఖ్య కార్యదర్శి లేఖ పంపారు.
హరిప్రసాద్ ను పంపడంపై ఈసీ ఎందుకు అభ్యంతరం తెలుపుతుందని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఒకరికి ఓటు వేస్తే మరొకరికి వెళ్తుందని ఆరోపించింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని, సక్రమంగా పని చేయడం లేదన్న అంశాలను టీడీపీ నేతలు ప్రధానంగా ఈసీ ముందు ప్రస్తావించారు. ఈసీ లేఖకు ప్రతిగా టీడీపీ మరో లేఖ రాయనుంది.