వైసీపీకి ఓటేస్తే మరణవాంగ్మూలం రాసుకున్నట్లే : చంద్రబాబు

వైసీపీకి ఓటేస్తే మరణ వాంగ్మూలం మనం రాసుకున్నట్లేనని సీఎం చంద్రబాబు అన్నారు.

  • Published By: veegamteam ,Published On : March 26, 2019 / 11:19 AM IST
వైసీపీకి ఓటేస్తే మరణవాంగ్మూలం రాసుకున్నట్లే : చంద్రబాబు

Updated On : March 26, 2019 / 11:19 AM IST

వైసీపీకి ఓటేస్తే మరణ వాంగ్మూలం మనం రాసుకున్నట్లేనని సీఎం చంద్రబాబు అన్నారు.

కర్నూలు : వైసీపీకి ఓటేస్తే మరణ వాంగ్మూలం మనం రాసుకున్నట్లేనని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు రావని తెలిపారు. కేసీఆర్ ఆంధ్రావాళ్లు ద్రోహులన్నారు…తెలంగాణలో ఫామ్-7 తో ఓట్లన్ని తొలగించారని మండిపడ్డారు. మనల్ని అవమానించే కేసీఆర్ తో జగన్ కలిశారని తెలిపారు. జగన్.. కేసీఆర్ తో కలవడం తప్పే అన్నారు. ఆళ్లగడ్డలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడారు.

నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేసీఆర్ కు జగన్ అప్పగిస్తారని ఆరోపించారు. పోలవరాన్ని అడ్డుకునేందుకు కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారని తెలిపారు. పోతిరెడ్డిపాడును మూసివేయాలని అంటున్నారని చెప్పారు. కేసీఆర్, మోడీలు ఏపీకి విరోధులని..వీరితో కలిసిన జగన్ రాష్ట్ర ద్రోహి అని మండిపడ్డారు. మోడీ, కేసీఆర్, జగన్ ను చూస్తే భయపడతామా? కులం కావాలా? నీళ్లు కావాలా? తేల్చు కోవాలన్నారు. తాను కులం, మతం చూసి పనులు చేయలేదని స్పష్టం చేశారు.

తెలంగాణ కంటే ఏపీని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవతో రైతులకు పెట్టుబడి అందించామని తెలిపారు. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చామన్నారు. రైతుల రుణామాఫీ చేశామని చెప్పారు. నదులను అనుసంధానం చేశామని తెలిపారు. హైటెక్ సిటీ కట్టింది తానేని చెప్పారు. భూమా అఖిల ప్రియను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు.