అసెంబ్లీలో ఇంగ్లీష్ వార్ : చంద్రబాబు సస్పెన్షన్ కు డిమాండ్

ఏపీ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై రగడ జరిగింది. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్పీకర్ తమ్మినేని, చంద్రబాబు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రశ్నోత్తరాల

  • Published By: veegamteam ,Published On : December 11, 2019 / 05:40 AM IST
అసెంబ్లీలో ఇంగ్లీష్ వార్ : చంద్రబాబు సస్పెన్షన్ కు డిమాండ్

Updated On : December 11, 2019 / 5:40 AM IST

ఏపీ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై రగడ జరిగింది. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్పీకర్ తమ్మినేని, చంద్రబాబు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రశ్నోత్తరాల

ఏపీ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై రగడ జరిగింది. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్పీకర్ తమ్మినేని, చంద్రబాబు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం నిర్ణయం గురించి చంద్రబాబు లేవనెత్తారు. చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు 50 ఏళ్లుగా ఎంఫిల్ చేస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. చెవిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించేందుకు మరోసారి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అందుకు స్పీకర్ అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 

మర్యాదగా మాట్లాడాలి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో స్పీకర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. చంద్రబాబు తనను బెదిరించేలా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. వెంటనే వ్యాఖ్యలు ఉప సంహరించుకోవాలని సూచించారు. స్పీకర్ ను పట్టుకుని మర్యాదగా ఉండదని అనడం కరెక్ట్ కాదన్నారు. స్పీకర్ స్థానానికి చంద్రబాబు గౌరవం ఇవ్వడం లేదన్నారు.

ఇంత సీనియారిటీ ఉండి ఏం లాభం అని చంద్రబాబుని ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గౌరవంగా ప్రవర్తించాలన్నారు. దీనికి చంద్రబాబు సైతం గట్టిగా స్పందించారు. సీటు నుంచి లేచి ఆవేశంగా మాట్లాడారు. దీంతో..వైసీపీ నేతలంతా స్పీకర్ ను అగౌరవపరిచిన చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.