పవన్ కల్యాణ్ భీమవరం పర్యటనలో మార్పులు

పవన్ కల్యాణ్ నాన్ లోకల్ కాదు, పక్కా లోకల్. చంద్రబాబు, జగన్ మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు.

పవన్ కల్యాణ్ భీమవరం పర్యటనలో మార్పులు

Pawan Kalyan

Updated On : February 19, 2024 / 5:27 PM IST

Pawan Kalyan : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీన పవన్ కల్యాణ్ భీమవరంలో పర్యటించాల్సి ఉంది. అయితే, పవన్ పర్యటన ఒక రోజు వాయిదా పడింది. 21న యధావిధిగా జరగనుంది. 21‌వ తేదీన పవన్ కల్యాణ్ ఉదయం 10 గంటలకు మంగళగిరి నుండి హెలికాప్టర్ లో భీమవరం కాస్మోపాలిటిన్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుండి నిర్మల ఫంక్షన్ హాల్ కు చేరుకుని జనసేన-టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు అని భీమవరం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు.

Also Read : గుడివాడ వైసీపీలో కొత్త రాజకీయం.. కొడాలి నానికి వైసీపీ అధిష్టానం షాకివ్వబోతుందా?

”భీమవరం నుండే పవన్ కళ్యాణ్ ఫొటీ చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. పవన్ కల్యాణ్ నాన్ లోకల్ కాదు, పక్కా లోకల్. చంద్రబాబు, జగన్ మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు. భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి, ఆయన నివాసం ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాం” అని చంద్రశేఖర్ వెల్లడించారు.

వాస్తవానికి.. ఈ నెల 14న భీమవరంలో పవన్ పర్యటించాల్సి ఉండగా.. హెలిప్యాడ్ కు అధికారులు అనుమతి నిరాకరించడంతో పర్యటన వాయిదా పడింది.