గంటన్నరపాటు ప్రధాని మోడీతో జగన్ ఏం చర్చించారు..
ఏపీ సీఎం జగన్ బుధవారం(ఫిబ్రవరి 12,2020) ప్రధాని మోడీని కలిశారు. గంటన్నరపాటు ప్రధానితో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ప్రధాని మోడీతో జగన్

ఏపీ సీఎం జగన్ బుధవారం(ఫిబ్రవరి 12,2020) ప్రధాని మోడీని కలిశారు. గంటన్నరపాటు ప్రధానితో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ప్రధాని మోడీతో జగన్
ఏపీ సీఎం జగన్ బుధవారం(ఫిబ్రవరి 12,2020) ప్రధాని మోడీని కలిశారు. గంటన్నరపాటు ప్రధానితో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ప్రధాని మోడీతో జగన్ చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధానితో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతో పాటు రాజకీయపరమైన అంశాలపైనా జగన్ చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఆమోదించిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని పార్లమెంట్‌లో ఆమోదింపజేయాలని సీఎం జగన్ ప్రధాని మోడీని కోరినట్లు తెలుస్తోంది. అలాగే మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ కోరినట్టు వార్తలొస్తున్నాయి. బుధవారం ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో… కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లారు సీఎం జగన్. ఢిల్లీలో ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. మొదట ఎంపీలతో కలిసి సమావేశంలో పాల్గొన్న జగన్.. ఆ తర్వాత కాసేపు ఏకాంతంగా మోడీతో చర్చలు జరిపారు.
జగన్‌తో పాటు వైసీపీ ఎంపీలు, ఆ పార్టీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి సైతం సమావేశంలో పాల్గొన్నారు. సీఎం జగన్‌కు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో… బీజేపీ కూడా శాసనమండలి రద్దుకు సానుకూలంగా సంకేతం ఇచ్చినట్టు కనిపిస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. దాదాపు మూడు నెలల తర్వాత సీఎం జగన్ ప్రధాని మోడీతో సమావేశం కావడం, ఏం చర్చించారు అనే అంశాలు ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. మూడు రాజధానుల అంశంపైనా ప్రధాని మోడీతో జగన్ చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.
సీఎం జగన్ ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల తరుణంలో.. జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది. విభజన హామీల్లో రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులతో పాటు రెవెన్యూ లోటుకు సంబంధించిన అంశాలను ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజనలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు, కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన నిధులను కేటాయించాలని మరోసారి ప్రధాని దృష్టికి సీఎం జగన్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లుకు శాసన మండలిలో బ్రేక్‌లు పడడంతో… మండలని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన జగన్ సర్కార్… దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపిన సంగతి తెలిసిందే.