కేసీఆర్ తర్వాత కేటీఆరే CM
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం ఎవరో చెప్పారు. కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు కేటీఆర్ సీఎం అవుతారని.. ఇలా ప్రజలు

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం ఎవరో చెప్పారు. కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు కేటీఆర్ సీఎం అవుతారని.. ఇలా ప్రజలు
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం ఎవరో చెప్పారు. కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు కేటీఆర్ సీఎం అవుతారని.. ఇలా ప్రజలు అనుకుంటున్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేసీఆర్ తర్వాత సీఎం.. కేటీఆర్ అనుకోవడం సహజం అన్నారు. ఈ రోజో, రేపో, ఇంకో 5 లేదా పదేళ్ల తర్వాత అయినా కేటీఆర్ సీఎం కావొచ్చు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేటీఆర్ పార్టీలో ఉన్నారని, ఉద్యమంలో కేటీఆర్ ది కీలక పాత్ర అని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కేటీఆర్ ముక్కుసూటి మనిషి అన్నారు.
కేంద్రం సహకరించకున్నా అభివృద్ధి చేసుకునే దమ్ము కేసీఆర్ కు ఉందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతల్లో ఒకరంటే ఒకరికి గిట్టదన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ కుంటి సాకులు వెతుకుతోందన్నారు. తెలంగాణ అభివృద్దిని చూసి బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చుపెట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. కొన్ని పార్టీలు మతకలహాలు సృష్టించి ఓట్లు దండుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఒక్కసారైనా కర్ఫ్యూ విధించారా అని అడిగారు.
కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత ఎవరు అనే చర్చ చానాళ్లుగా జరుగుతోంది. పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆరే అని కొందరు అంటే.. హరీష్ రావుని తెరపైకి తెచ్చేవాళ్లూ ఉన్నారు. హరీష్ రావు డైనమిక్ లీడర్ అని, పాలనాదక్షత ఉన్న నాయకుడు అని ఓ వర్గం చెబుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేస్తారు. అపారమైన రాజకీయ అనుభవం, చాణక్యత హరీష్ సొంతం అంటారు. అందుకే.. కేసీఆర్ తర్వాత ఆ పొజిషన్ కి హరీష్ కరెక్ట్ గా సరిపోతారు అని వాదిస్తారు. ఈ క్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్ తర్వాత ఎవరు..? అనే చర్చకు ఇంతటితో తెరపడుతుందో.. లేక.. మరింత పెరుగుతుందో చూడాలి.