ఎక్స్‌పైర్ మెడిసిన్.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్.. సీఎం జగన్, విజయసాయిరెడ్డిపైనా కీలక వ్యాఖ్యలు

సాగర్ ను ఏపీ సీఎం జగన్ పోలీసులతో ఆక్రమించినా.. కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు?నాన్ సీరియస్ పొలిటీషియన్. అలాంటి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

ఎక్స్‌పైర్ మెడిసిన్.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్.. సీఎం జగన్, విజయసాయిరెడ్డిపైనా కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy Shocking Comments On KCR

Updated On : February 8, 2024 / 5:24 PM IST

CM Revanth Reddy : మీడియాతో చిట్ చాట్ లో మాజీ సీఎం కేసీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్.. ఎక్స్ పైరీ అయిన మెడిసిన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోవడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

”ప్రజలు వారిని పట్టించుకోవడం లేదు. గవర్నర్ ప్రసంగానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదు. దీంతో ప్రతిపక్ష నేత ఏంటో అందరికీ తెలిసిపోతుంది. బీఏసీకి కూడా రాలేదంటే ఆయన చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. హరీశ్ రావును ఎలా అడ్డుకుంటాం. బీఆర్ఎస్.. కేసీఆర్, కడియం పేరు ఇచ్చారు. అనుమతి ఇవ్వాలో లేదో.. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. రేపు హిమాన్ష్ కూడా వస్తా అంటాడు.

Also Read : సీఎం రేవంత్, భట్టివిక్రమార్కపై ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ఆసక్తికర కామెంట్స్

బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నా. ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత నిర్వర్తించాలి. టీఎస్ పీఎస్ సీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాలపై ప్రొసీజర్ తో ప్రభుత్వం ముందుకెళ్తోంది. కసబ్ కు ఉరి కూడా.. ప్రొసీజర్ తోనే జరిగింది. భవిష్యత్తులో నిరుద్యోగులు ఇబ్బందులు పడకూడదు.

బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం మార్పు స్పీకర్ నిర్ణయం. అసెంబ్లీ సమావేశాల్లో కులగణన తీర్మానం ఉంటుంది. అవసరం అనుకుంటే సభా సమావేశాలను స్పీకర్ పొడిగించవచ్చు. Krmb కి ప్రాజెక్ట్ లను గత ప్రభుత్వమే కేంద్రానికి అప్పగించింది. సాగర్ ను ఏపీ సీఎం జగన్ పోలీసులతో ఆక్రమించినా.. కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు? ప్రతిరోజు 12 టీఎంసీల నీటిని ఏపీకి తీసుకెళ్లినా కేసీఆర్ అడ్డుకోలేదు. బేసిన్ లు లేవు భేషజాలు లేవని కేసీఆర్ ఆయన కమిట్ మెంట్ కృష్ణా బేసిన్ లో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారు. సీఎంగా నేను కేసీఆర్ ను కూడా కలుస్తా. విజయసాయి రెడ్డి.. ఒక నాన్ సీరియస్ పొలిటీషియన్. అలాంటి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : లోక్‌సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు.. ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్న ఆశావహులు వీరే..