Mallikarjun Kharge slams bjp: బీజేపీ జాతీయాధ్యక్షుడిని ఎవరు నిర్దేశిస్తారో అందరికీ తెలుసు: ఖర్గే

తమ పార్టీలోని నేతల మధ్యే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతోందని ఖర్గే అన్నారు. బీజేపీ చరిత్రలో ఎన్నడూ ఇటువంటి ఎన్నిక జరగలేదని ఖర్గే తెలిపారు. దేశంలో ఉద్యోగాలు కల్పిస్తానని యువతకు మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ఆయన చెప్పారు. అంతేగాక, కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు. దేశంలో నిరుద్యోగులు మరింత పెరిగిపోయారని విమర్శలు గుప్పించారు.

Mallikarjun Kharge slams bjp: బీజేపీ జాతీయాధ్యక్షుడిని ఎవరు నిర్దేశిస్తారో అందరికీ తెలుసు: ఖర్గే

Mallikarjun Kharge

Updated On : October 8, 2022 / 3:01 PM IST

Mallikarjun Kharge slams bjp: బీజేపీ జాతీయాధ్యక్షుడిని ఎవరు నిర్దేశిస్తారో అందరికీ తెలుసు అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నికకు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తమ పార్టీ నేతల మద్దతు కోరుతున్న ఆయన.. ఇవాళ హైదరాబాద్ చేరుకుని తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తమ పార్టీలోని నేతల మధ్యే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతోందని అన్నారు.

బీజేపీ చరిత్రలో ఎన్నడూ ఇటువంటి ఎన్నిక జరగలేదని ఖర్గే తెలిపారు. దేశంలో ఉద్యోగాలు కల్పిస్తానని యువతకు మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ఆయన చెప్పారు. అంతేగాక, కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు. దేశంలో నిరుద్యోగులు మరింత పెరిగిపోయారని విమర్శలు గుప్పించారు.

మోదీ పాలనలో రూపాయి మారకం విలువ డాలర్ తో పోల్చితే రూ.82కి పడిపోయిందని ఖర్గే చెప్పారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగిపోయాయని చెప్పారు. పాలు, పెరుగు, పెన్సిళ్లు, రబ్బర్లపైనా జీఎస్టీ బాదుతున్నారని విమర్శించారు. కాగా, ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక పోటీలో మల్లికార్జున ఖర్గే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ ఎన్నిక ఈ నెల 18న ఎన్నిక జరగనుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..