CAAపై చర్చ జరగాల్సిందే..సభలో చర్చించి తీర్మానం చేద్దాం – కేసీఆర్

  • Published By: madhu ,Published On : March 7, 2020 / 05:54 AM IST
CAAపై చర్చ జరగాల్సిందే..సభలో చర్చించి తీర్మానం చేద్దాం – కేసీఆర్

Updated On : March 7, 2020 / 5:54 AM IST

CAAపై చర్చ జరగాల్సిందే..రాష్ట్ర శాసనసభలో చర్చించి తీర్మానం చేద్దామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాన్ని కుదిపేస్తున్న అంశమని, సీఏఏపై అనుమానాలున్నాయన్నారు. అంతేగాకుండా..భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2020, మార్చి 07వ తేదీ శనివారం రెండో రోజు ప్రారంభమైన సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది.

అయితే..విపక్షానికి చెందిన సభ్యులు CAAపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో..సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. సీఏఏపై తప్పకుండా చర్చించాల్సిందేనన్నారు. దీనిపై ఇతర రాష్ట్రాల శాసనసభలు తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా ? లేదా ? అనేది అనవసరమని, దీనిపై చర్చ జరగాల్సిందేనని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రజల ఆలోచనలు కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసే హక్కు ఉందన్నారు. CAA విషయంలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చన్నారు. అయినా..ఎవరు ఏ విషయం అసెంబ్లీలో చెప్పినా..అందరూ వినిపించుకోవాలన్నారు. అసెంబ్లీలో చర్చించి..ఒక తీర్మానం పాస్ చేసి…కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సినవసరం ఉందన్నారు. 

See Also | టిక్ టాక్‌లో పరాయి వ్యక్తితో పరిచయం, మహిళ ప్రాణం తీసింది

తూ కిత్తా..మై కిత్తా..అనేది కాదు..భవిష్యత్‌లో జరిగే పరిణామాలను ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. బీజేపీ సభ్యుడు రాజా సింగ్‌కు కూడా అవకాశం ఇవ్వాలని, ఎంత సమయమైనా చర్చిద్దామని సూచించారు. కేబినెట్‌లో కూడా చర్చించామన్నారు. జీఎస్టీ డబ్బులు రావడం లేదని, ఆర్థిక మంత్రిని కలవడం జరిగిందని సభలో వెల్లడించారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కు కాబట్టి..దీనిపై కూడా చర్చిద్దామని..ప్రస్తుతం ఎలాంటి వివాదం చేయవద్దని సభ్యులకు సూచించారు.

సీఏఏపై ఏదో ఒక రోజు డిసైడ్ చేసుకుని సభలో చర్చిద్దామని, ఎంత సమయమైనా ఫర్వాలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనిపై స్పీకర్ మాట్లాడుతూ..ఒకరోజు చర్చిద్దామని, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రస్తుతం మాట్లాడాలని సభ్యులకు సూచించారు. 

Read More : రెండు ఛానళ్లపై నిషేధం ఎత్తివేత