Harish Rao Thanneeru : వారి కోసమే బలహీనమైన అభ్యర్థులను నిలుపుతోంది- కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్

భావోద్వేగాలు రెచ్చగొట్టే బండి సంజయ్ ని గెలిపించారు. ఆయన కరీంనగర్ కు ఏం చేశాడు? తెలంగాణకు ఏమిచ్చింది బీజేపీ?

Harish Rao Thanneeru : వారి కోసమే బలహీనమైన అభ్యర్థులను నిలుపుతోంది- కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్

Harish Rao Thanneeru

Harish Rao Thanneeru : బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఆ రెండు పార్టీలపై ఆయన నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటే అని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారని కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. ఇప్పుడు బడే బాయ్.. చోటే బాయ్ ఒక్కటయ్యారని విరుచుకుపడ్డారు. కరీంనగర్ లో ఇంతవరకు ఎంపీ అభ్యర్థిని ప్రకటించ లేదు. బీజేపీ-కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి. చాలా చోట్ల బహీనమైన అభ్యర్థులను కాంగ్రెస్ బరిలో నిలుపుతోంది అని హరీశ్ రావు ఆరోపించారు.

”కరీంనగర్ లో చదువుకున్న విద్యార్ధిని నేను. జరిగిన అభివృద్ధి చూస్తే నా రెండు కళ్ళు సరిపోవడం లేదు. బీఆర్ఎస్ కు కరీంనగర్ పుట్టినిల్లు వంటిది.
కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు రైల్వే లైన్ మంజూరు చేయించారు. జాతీయ రహదారులు సాధించింది వినోదన్న. కరీంనగర్ కు నర్సింగ్, మెడికల్ కాలేజీలు తెచ్చాం.

భావోద్వేగాలు రెచ్చగొట్టే బండి సంజయ్ ని గెలిపించారు. ఆయన కరీంనగర్ కు ఏం చేశాడు? తెలంగాణకు ఏమిచ్చింది బీజేపీ? పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. నిరుద్యోగం పెరిగింది. నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు. మెడికల్ కాలేజ్ ఇవ్వాలంటే మొండిచెయ్యి చూపించారు. పదేళ్లలో రాష్ట్రంలో చేసిన మంచి పని ఏంటో చెప్పండి. ఇంటికో క్యాలెండర్, చిత్రపటాలు పంచుతున్నారు. అవి కడుపు నింపుతాయా?

ఓడిపోయినా కరీంనగర్ అభివృద్ధి కోసం వినోద్ కుమార్ పని చేశారు. కాంగ్రెస్ వచ్చిన 4 నెలలకే దినం తప్పి దినం నల్లా వస్తుంది. నాలుగేళ్ళు కేసీఆర్ కరీంనగర్ ప్రజలకు నీళ్లు ఇచ్చారు. మమ్మల్ని గెలిపిస్తే 2వేలు వేస్తామన్నారు రేవంత్.2వేలు పడితే కాంగ్రెస్ కు ఓటెయ్యండి. లేకపోతే బీఆర్ఎస్ కి వెయ్యండి. పెన్షన్ 4వేలు చేస్తామని చేయలేదు. పింఛన్లు ఏవంటే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. జనవరి నెల 2వేల పింఛన్ ఇవ్వలేదు. నిరుద్యోగభృతి ఎప్పుడిస్తారని అడిగితే ఆ హామీ ఇవ్వలేదని భట్టి విక్రమార్క అంటున్నారు.

బిడ్డా రేవంత్ రెడ్డి. ఎంపీ ఎన్నికల్లో ప్రజలు మీకు సురుకు పెడతారు. సొల్లు మాటలు తప్పితే కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? పరిపాలన చేతకాదు, హామీలు అమలు చేయరు. కేసీఆర్ చెడ్డీ ఊడగొడతా అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమైనా చెడ్డి గ్యాంగ్ వెంట తిరిగారా? రేవంత్ రెడ్డి ఎన్నడైనా జై తెలంగాణ అన్నారా? అమరవీరుల స్తూపం వద్ద పువ్వులైనా పెట్టి నివాళులు అర్పించు. రేవంత్ రెడ్డి ఉద్యమ సమయంలో తుపాకీ పట్టుకొని బయల్దేరాడు. కాంగ్రెస్ వాళ్ళవి ఉద్ధరించే మాటలు కావు ఉద్దెర మాటలు” అని హరీశ్ రావు అన్నారు.

Also Read : 14 ఎంపీ సీట్లే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్