రాజధాని రైతులకు అన్యాయం జరిగితే నా ప్రాణం అడ్డేస్తా..

  • Published By: chvmurthy ,Published On : December 30, 2019 / 03:36 PM IST
రాజధాని రైతులకు అన్యాయం జరిగితే నా ప్రాణం అడ్డేస్తా..

Updated On : December 30, 2019 / 3:36 PM IST

రాజధాని అనేది ఏదో ఒక ప్రాంతంలో సంపూర్ణంగా ఏర్పాటు చేసి, అభివృధ్దిని రాష్ట్రం అంతటికీ  పంచాలని ఈవిషయమై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  అన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన 3రాజధానులు,  హైపవర్ కమిటీల ఏర్పాటు, రాజధాని రైతుల ఆందోళనపై ఆయన ఈరోజు స్పందించారు.

రాజధాని రైతులు ఆరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చారు కానీ వ్యక్తులకు కాదని పవన్ కళ్యాణ్  అన్నారు. రాజధానిరైతులకు అండగానిలబడాల్సిందిపోయి వారిపై కేసులు పెట్టి జైల్లో పెట్టించటం ఏంటని పవన్ ప్రశ్నించారు.  రాజధాని విశాఖలో పెడతామనికానీ, కర్నూలులో హై కోర్టు పెడతామని ఇంతవరకూ వైసీపీ నేతలు కానీ జగన్ రెడ్డి కానీ చెప్పలేదన్న విషయం ప్రజలు గమనించాలని ఆయన అన్నారు.  అసలు కర్నూలులో హై కోర్టు పెట్టటానికి వీళ్లకు అధికారం ఉందాలేదా అనేవిషయం వీళ్లు తెలుసుకోవాలని అన్నారు. అలాంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా,కేంద్ర ప్రభుత్వానికి ఉందా, రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. 

 అమరావతి రాజధానిపై  ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నరోజుల్లో ….13 చిన్న జిల్లాలు వీటిలో చిచ్చులు పెట్టకూడదు అని చెప్పిన వ్యక్తి  ఇప్పుడు మారుస్తాను అంటే ఎలా అని  ప్రశ్నించారు.  ఆరోజే అమరావతిని వ్యతిరేకించి ఉంటే రైతులు భూములు ఇచ్చి ఉండేవారు కాదు అని పవన్ అన్నారు. జీఎన్ రావు కమిటీ కూడావిశాఖలోనో, భీమిలి లోనూ పెట్టమని చెప్పలేదని వెనుకబడ్డ విజయనగరం జిల్లాలో పెట్టమని  ప్రతిపాదించిందని అన్నారు. వాళ్లు చెప్పిన సిఫార్సులనే ఇంకా అమలు చేయలేదని… ప్రజల మధ్య వైషమ్యాలు  పెంచేలా సీఎం ప్రకటనలు ఉన్నాయన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగి ఉంటే  వాటిపై విచారణ జరిపి  వాళ్లను శిక్షించండి. జుడీషియల్ కమిటీలు వేయండి. సీబీఐకి రిపోర్టులు ఇవ్వండి. అధికారం చేతిలో ఉండి ఇవన్నీ చేయకుండా ప్రజల్లో గందరగోళం సృష్టించడం ఎందుకని పవన్ ప్రశ్నించారు.  కర్నూలులో హైకోర్టు పెట్టడమంటే రాయలసీమ ప్రజల్నికూడా మోసం చేయడమే. హైకోర్టు మార్చే అధికారం ప్రభుత్వానికి ఉందా? లేదా? అనేది అక్కడి న్యాయవాదులతో కూర్చుని మాట్లాడాలని సూచించారు. 

మీరు రాష్ట్రంలో వెనుక బాటతనాన్ని ఆపాలంటే పరిశ్రమలు తీసుకురండి అభివృధ్ది చేయండి అని సూచించారు. రాజధానిగా అమరావతి వద్దు అనుకుంటే ఎక్కడ పెడతారో అసెంబ్లీ ధైర్యంగా చెప్పాలని డిమాండ్ చేశారు.  అసెంబ్లీ లో చెప్పిండి. పాలకులు చేసిన తప్పులు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్నాయి. కొంతమంది వ్యక్తులు చేసిన పనులు వల్ల ఇవాళ వైషమ్యాలు పెరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు.  

రైతులు ప్రభుత్వాని నమ్మిభూములు ఇచ్చారు. మీరు వారి మీద కేసులు పెడుతున్నారు. కడుపుమండిన వ్యక్తి  ఏస్దాయికి వెళతాడో ఊహించగలరా అని ఆయన ప్రశ్నించారు. అమరావతి రైతులకు అన్యాయం జరిగితే వారికి  నాప్రాణాలు అడ్డువేసి అడ్డుకుంటానని ….అమరావతి రైతులకు న్యాయం చేయకుండా ముందుకు వెళతానంటే వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.