సంయమనం పాటించండి : జనసైనికులకు పవన్ కళ్యాణ్ లేఖ

ఏపీ సీఎం జగన్ సోమవారం, నవంబర్ 11న, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్,మాజీ సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుల పిల్లల చదువులపై చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ స్పందించింది.
సీఎం జగన్ వ్యాఖ్యలపై పార్టీకి చెందిన నాయకులు, జనసైనికులు ఎవరూ స్పదించవద్దని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తీవ్రమైన భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైనా, ప్రభుత్వ పాలసీలపైన పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారని, వాటిని పక్కదోవ పట్టించటానికే సీఎం జగన్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నట్లు పార్టీ భావిస్తోందని ఆయన జనసైనికులకు రాసిన లేఖలో అన్నారు.
మంగళవారం, నవంబర్ 12 సాయంత్రం పవన్ కళ్యాణ్ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి అన్నిటికీ సమాధానం చెపుతారని వివరించారు.