వేతనం సరిపోలేదా : రూ. 50 వేలు కోసం..జూబ్లీహిల్స్ ఎస్.ఐ. లంచావతారం

  • Published By: madhu ,Published On : January 9, 2020 / 11:56 AM IST
వేతనం సరిపోలేదా : రూ. 50 వేలు కోసం..జూబ్లీహిల్స్ ఎస్.ఐ. లంచావతారం

Updated On : January 9, 2020 / 11:56 AM IST

వేతనాలు సరిపోవడం లేదో..ఇంకా సంపాదించాలనే ఆశతో లంచాలకు ఎగబడుతున్నారు పలువురు ఉద్యోగులు. ఇందులో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన వారు ఉండడం విస్మయానికి గురి చేస్తోంది. ఇటీవలే సిద్ధిపేట ఎస్పీ ఏసీబీకి చిక్కిన సంగతి మరిచిపోకముందే..జూబ్లీహిల్స్ ఎస్ఐ సుధీర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కడం గమనార్హం. 2020, జనవరి 09వ తేదీ గురువారం రూ. 50వేలు లంచం తీసుకుంటుండగా..ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. సివిల్ కేసులో సుధీర్ రెడ్డి లంచం డిమాండ్ చేశారు. అనంతరం సుధీర్ రెడ్డిని జూబ్లీహిల్స్ పీఎస్‌లోనే ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

2014 బ్యాచ్‌కు చెందిన సుధీర్…మెదక్ జిల్లా, గజ్వేల్ ప్రాంతానికి చెందిన వారు. జూబ్లీహిల్స్ పీఎస్‌లో దాదాపు 18 నెలల నుంచి వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అడ్మిన్ ఎస్ఐ..విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా సివిల్ తగాదాల్లో లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. 50 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులకు కంప్లయింట్ అందడంతో రైడ్ చేశారు. ఈ ఘటనలో సీఐ పాత్ర కూడా ఉందని సుధీర్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ నేతృత్వంలో జరుగుతున్న ఈ సోదాలు ముగిసిన అనంతరం పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

Read More : మచిలీపట్నంలో బాబు..హారతులతో స్వాగతం