జగన్.. నీజాయతి ఉంటే రా : కేఏ పాల్‌పై హత్యకు కుట్ర

  • Published By: vamsi ,Published On : April 7, 2019 / 07:52 AM IST
జగన్.. నీజాయతి ఉంటే రా : కేఏ పాల్‌పై హత్యకు కుట్ర

Updated On : April 7, 2019 / 7:52 AM IST

తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, తనపై దాడి చేసేందుకు జగన్ మనుషులను పంపించారిని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు. భీమవరంలో తనపై అర్ధరాత్రి 12.45 నుంచి ఒంటి గంట మధ్యలో అభిమానులం అంటూ వచ్చిన కొందరు తనపై దాడికి యత్నించారని, వెంటనే అప్రమత్తమై గది తలుపు వేసేశానని కేఏ పాల్ అన్నారు.

దీంతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారని, గతంలో తనపై ఆనంద్.ఇన్ హోటల్‌లో దాడి చేసేందుకు ప్రయత్నించిన బ్యాచ్.. ఇప్పుడు మరోసారి దాడికి ప్రయత్నించిందని, తనకు ప్రాణహాని ఉందని అన్నారు.

అందుకే తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇవ్వాలని అడిగానని, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మాత్రం ఓ గన్‌మెన్‌ను ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదని, భీమవరం సీఐ కనీసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సంధర్భంగా జగన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ‘ఓరేయ్ జగన్.. దమ్ముంటే రారా.. నాతో డిబేట్‌కు. చేతకాక పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నావ్. నేను జడుస్తాను అనుకుంటున్నావా? నేను ప్రపంచాన్ని జడిపించి ఇక్కడకు వచ్చాను. మా బీ-ఫారాలను దొంగలించడమే కాకుండా నా మీదే దాడి చేయిస్తావా?’ అంటూ మండిపడ్డారు.