గుడివాడ సీటు.. ఆ ప్రచారంపై ఎమ్మెల్యే కొడాలి నాని హాట్ కామెంట్స్
సీఎం జగన్ ప్రస్తుతమే, కాదు పర్మనెంట్ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎవరో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయానికి తీసేశాడు. ఫ్లెక్సీలు ఎవడైనా కట్టవచ్చు.

Kodali Nani
Kodali Nani : గుడివాడలో తనకు సీటు లేదంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం జగనే చెబుతారని ఆయన అన్నారు. రామోజీ రావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, పౌడర్ డబ్బా వాళ్లు కాదన్నారు కొడాలి నాని. మార్చే అభ్యర్థులు, తీసేసే వారి పేర్లనే గత ఏడు లిస్టుల్లో సీఎం జగన్ ప్రకటించారు.. రాష్ట్రంలో ఇంకా సీట్లు ప్రకటించని 105 సీట్లు ఉన్నాయని కొడాలి నాని అన్నారు. వినే వాడు తెలుగు తమ్ముళ్లైతే.. చెప్పేవాడు చంద్రబాబులా ఎల్లో మీడియా కథనాలు ప్రసారం చేస్తుందని విమర్శించారు. సీటు ఎవరికో.. అధిష్టానమో, మా పార్టీ నాయకులు చెబుతారు.. మధ్యలో ఉన్న పకోడీ గాళ్ళకేం సంబంధం అంటూ విరుచుకుపడ్డారు కొడాలి నాని.
”తెల్లరేషన్ కార్డు ఉన్న వ్యక్తులకు సీఎం జగన్ సీటు ఇచ్చాడు. బ్రోకర్ పనులు, పైరవీలు చేస్తానో.. డబ్బుందనో.. ఎవరో చెప్పారని వైసీపీలో సీట్లివ్వరు. సీఎం జగన్ లా చంద్రబాబు మగాడైతే….బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వాలి. గన్నవరం నుండి వల్లభనేని వంశీనే పోటీ చేస్తాడు. కుట్రలు కుతంత్రాల్లో భాగంగానే నాకు, వంశీకి సీటు లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. టీడీపీలో అయితే వారి మీడియా ఛానల్సే అభ్యర్థుల లిస్టులు ప్రకటిస్తాయి.
Also Read : గుడివాడ వైసీపీలో కొత్త రాజకీయం.. కొడాలి నానికి వైసీపీ అధిష్టానం షాకివ్వబోతుందా?
ఎవరో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయానికి తీసేశాడు. ఫ్లెక్సీలు ఎవడైనా కట్టవచ్చు. అవి అర్థవంతంగా ఉండాలిగా. దమ్ముంటే నన్ను ఓడించడానికి చంద్రబాబును గుడివాడ అభ్యర్థిగా పెట్టాలి. అదెలాగో చేతకాదు. ఎల్లో మీడియా అధినేతలందరూ అనుకుంటే నా సీటు పోతుందా. జీవితాంతం మాజీగా ఉండే చంద్రబాబు ఎక్స్ నుండి ఛాలెంజ్ లు చేస్తున్నారు. సీఎం జగన్ ప్రస్తుతమే, కాదు పర్మనెంట్ ముఖ్యమంత్రిగా ఉంటారు. చంద్రబాబు.. సీఎం జగన్ ను కాకుండా, తనలా మాజీలుగా ఉండే వాళ్లపై సోషల్ మీడియాలో ఛాలెంజ్ లో చేసుకోవాలి” అని కొడాలి నాని అన్నారు.