Bihar Politics: పెద్ద స్కెచ్చే వేసిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఒకే దెబ్బతో అటు నితీశ్, ఇటు కాంగ్రెస్ సెట్టైనట్టేనా?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాహుల్ గాంధీ గతంలో రాజ్యసభ సభ్యురాలు మిసి భారతి ఇంట్లో లాలూ ప్రసాద్‌ను కలిశారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు. మరోవైపు ప్రస్తుతం బీహార్ రాజకీయాలను లాలూ ప్రసాద్ యాదవ్ కంటే, నితీశ్ కుమార్ అంతగా అర్థం చేసుకోలేరని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు

Bihar Politics: పెద్ద స్కెచ్చే వేసిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఒకే దెబ్బతో అటు నితీశ్, ఇటు కాంగ్రెస్ సెట్టైనట్టేనా?

Updated On : August 14, 2023 / 4:00 PM IST

Lalu Prasad Yadav: రాష్ట్రీయ జనతా దళ్ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిహార్ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండడమే కాకుండా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి ఉత్తర భారతంలోని కీలక నేతల్లో ఒకరిగా ఎదిగిన నేత లాలూ. చదువు లేకపోయినా ఆయన మెదడు పదునుకు ఔరా అనాల్సిందే. ముఖ్యంగా రాజకీయాల్లో ఆయన వేసే ఎత్తుగడులు అలా ఉంటాయి. అయితే అనారోగ్యం, కోర్టు కేసులు వంటి కారణాలతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉన్న ఆయన.. కొద్ది రోజులుగా యాక్టివ్ అయ్యారు.

MLA Anil Kumar Yadav: సోనియా గాంధీనే భయపెట్టిన వ్యక్తి జగన్‌.. పవన్ వారాహికి పెట్రోల్ దండగ ..

అంతలోనే తన అమ్ముల పొది నుంచి బాణాలు తీసేందుకు సిద్ధమయ్యారు. విపక్ష ఇండియా కూటమికి సంబంధించి తాజాగా లాలూ పెద్ద స్కేచ్ వేశారని అంటున్నారు. విపక్షాల ఐక్యతకు రూపశిల్పి అయిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‭కు కీలక బాధ్యతలు అప్పగించడంతో పాటు తన కుమారుడు తేజశ్వీ యాదవ్‭ను ఒక స్థాయిలో నిలబెట్టేందుకు ఆయన పావులు కదుపుతున్నారట. త్వరలో ముంబయిలో జరగనున్న సమావేశంలో నితీశ్‌ కుమార్‌ను ఇండియా కూటమికి కన్వీనర్‌గా నియమించే అవకాశం ఉందనే అంటున్నారు, అదే సమయంలో బిహార్ సీఎంగా తేజశ్వీ అవ్వబోతున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Priyanka vs Modi: వారణాసి నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగితే నరేంద్రమోదీ ఓడిపోతారా?

ఇందుకోసం లాలూ ప్రసాద్ యాదవ్ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. నితీష్ కుమార్ ద్వారా ఇండియా కూటమిలో తన పట్టును బలోపేతం చేసుకోవడంతో పాటు తేజశ్వీని సీఎం చేసి బిహార్ లో మళ్లీ తనకు పూర్వవైభవం సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. సోనియా గాంధీతో లాలూ యాదవ్‌కు ఉన్న సత్సంబంధాలు తెలిసిందే. దీంతో సోనియాను ఒప్పంచి నితీశ్‭ను ఇండియా కన్వీనర్ చేయడం ఒకటైతే, నితీశ్‭పై ఒత్తిడి తీసుకురావడంతో తన కుమారుడిని సీఎం చేయడంలో లాలూ విజయం సాధించగలరని అంటున్నారు. వాస్తవానికి, ఇండియా కూటమికి సోనియాగాంధీ కన్వీనర్ అవబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Maharashtra Politics: ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‭కు భారీ ఊరట.. 6 షరతులతో బెయిల్ మంజూరు చేసిన సుప్రీం

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాహుల్ గాంధీ గతంలో రాజ్యసభ సభ్యురాలు మిసి భారతి ఇంట్లో లాలూ ప్రసాద్‌ను కలిశారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు. నితీశ్‭ను ఇండియా కన్వీనర్‌గా చేయడంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. నితీశ్ కుమార్‌ను కన్వీనర్‌గా చేయాలనే ప్రతిపాదనకు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ కూడా అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు ప్రస్తుతం బీహార్ రాజకీయాలను లాలూ ప్రసాద్ యాదవ్ కంటే, నితీశ్ కుమార్ అంతగా అర్థం చేసుకోలేరని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. నితీశ్ కుమార్‭ను తన గుప్పిట్లో బంధించడానికి ఇదే అసలు కారణం కానుందట. ఇండియా కన్వీనర్‭గా నితీశ్ కుమార్ అయిన వెంటనే బీహార్ రాజకీయాల్లో పెనుమార్పు వస్తుందని, తేజశ్వీ యాదవ్‌ను సీఎం పీఠంపై కూర్చోబెడతారని చెబుతున్నారు.