జీఎన్ రావు కమిటీ నివేదికతో రాష్ట్రంలో గందరగోళం : పవన్ కళ్యాణ్

జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చాక రాష్ట్రంలో గందరగోళం నెలకొందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : December 21, 2019 / 11:26 AM IST
జీఎన్ రావు కమిటీ నివేదికతో రాష్ట్రంలో గందరగోళం : పవన్ కళ్యాణ్

Updated On : December 21, 2019 / 11:26 AM IST

జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చాక రాష్ట్రంలో గందరగోళం నెలకొందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చాక రాష్ట్రంలో గందరగోళం నెలకొందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.  జీఎన్ రావు కమిటీ నివేదికతో ప్రజల్లో అయోమయం, గందరగోళం నెలకొందన్నారు. శనివారం(డిసెంబర్ 21, 2019) అమరావతిలో పవన్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి మండలి నిర్ణయం కోసం వేచిచూస్తామని చెప్పారు. జనసేన నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. అభివృద్ధి అంటే సంపద సృష్టించే వనరులను ఏర్పాటు చేయడం..కానీ అభివృద్ధి అంటే 4 ప్రభుత్వ కార్యాలయాలో లేక 4 భవనాలో కాదన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, రాజకీయ జవాబుదారీతనం కావాలన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై పవన్ ఇప్పటికే అభ్యంతరం తెలిపారు.

ఇదిలావుంటే మూడు రాజధానులుగా మార్చే ఆలోచనను పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి స్వాగతించారు. అధిరార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. సామాజిక, ఆర్థిక అసమానతులు తొలగించేలా కమిటీ సిఫార్సులున్నాయని తెలిపారు. గతంలో అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే ఆర్థిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇప్పటికే రూ.3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇంకో రూ.లక్ష కోట్ల అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాజధాని రైతుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించాలన్నారు. మూడు రాజధానులపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్థాలు నివారించేలా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని సూచించారు.

జీఎన్ రావు కమటీ నివేదికకు వ్యతిరేకంగా అమరావతిలో నిరసనలు మిన్నంటాయి. అమరావతి వెలగపూడిలో రైతులు ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జీఎన్ రావును అడ్డుకునేందుకు రోడ్డుపై రైతులు ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో జీఎన్ రావును పోలీసులు మరో మార్గంలో పంపించారు. రైతుల ఆందోళనతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జగన్ కు పరిపాలన అనుభవ రాహిత్యం ఉందని విమర్శించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి జగన్ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రైతుల ఆందోళనతో సచివాలయ ప్రాతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ సీఎం జగన్ కు నివేదిక ఇచ్చింది. సీఎంకు ఇచ్చిన నివేదికలో చేసిన సూచనలను, సిఫార్సులను కమిటీ సభ్యులు మీడియాకు వివరించారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తాము నివేదికలో సూచించామని కమిటీ సభ్యులు తెలిపారు. విశాఖలో సీఎంవో, సచివాలయం, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్.. అమరావతిలో అసెంబ్లీ, రాజ్ భవన్, మంత్రుల క్వార్టర్స్, హైకోర్టు బెంచ్, సీఎం క్యాంప్ ఆఫీస్.. కర్నూలులో హైకోర్టు, సీఎం క్యాంప్ ఆఫీస్, శీతాకాల అసెంబ్లీ ఏర్పాటు చేయాలని నివేదికలో సూచించామన్నారు. అంతేకాదు.. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని 4 రీజియన్ లుగా విభజించాలని తాము సిఫార్సు చేసినట్టు కమిటీ సభ్యులు వివరించారు. ఉత్తర, మధ్య, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్ లుగా రాష్ట్రాన్ని విభజించాలని కోరామన్నారు.