తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి అరెస్ట్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో టీడీపీ

  • Published By: veegamteam ,Published On : October 30, 2019 / 06:27 AM IST
తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి అరెస్ట్

Updated On : October 30, 2019 / 6:27 AM IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో టీడీపీ

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో టీడీపీ నేత నాగరాజు ఇంటికి అడ్డంగా ప్రత్యర్థులు బండరాళ్లు పాతారు. విషయం తెలుసుకున్న జేసీ.. బండరాళ్లను తొలగించేందుకు స్వయంగా ఇంటి నుంచి వెంకటాపురంలో బయలుదేరారు. ఇది తెలుసుకున్న పోలీసులు మధ్యలోనే జేసీని అడ్డుకున్నారు. తనను అడ్డుకున్న పోలీసులతో జేసీ వాగ్వాదానికి దిగారు. తనను అడ్డగించడం కరెక్ట్ కాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాను వెళ్లాల్సిందే అన్నారు.

పోలీసులు మాత్రం అందుకు అంగీకరించ లేదు. తప్పని పరిస్థితుల్లో పోలీసులు జేసీ దివాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

జేసీ అరెస్ట్ పై టీడీపీ కార్యకర్తలు, అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుని ఖండించారు. పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారని మండిపడ్డారు. జేసీ అరెస్ట్ విషయం తెలిసి కార్యకర్తలు, అనుచరులు పెద్ద సంఖ్యలో పీఎస్ కు వస్తున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందు జాగ్రత్తగా పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు.