రాజధాని రగడ : వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే టీడీపీ పోటీ చెయ్యదు
ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తప్ప రాజధానిపై ప్రభుత్వం దిగిరాదని టీడీపీ అంటోంది. రాజధాని కోసం రాజీనామాలు చేస్తే.. టీడీపీ పోటీ చేయబోదని కూడా స్పష్టం చేసింది. ల్యాండ్

ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తప్ప రాజధానిపై ప్రభుత్వం దిగిరాదని టీడీపీ అంటోంది. రాజధాని కోసం రాజీనామాలు చేస్తే.. టీడీపీ పోటీ చేయబోదని కూడా స్పష్టం చేసింది. ల్యాండ్
ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తప్ప రాజధానిపై ప్రభుత్వం దిగిరాదని టీడీపీ అంటోంది. రాజధాని కోసం రాజీనామాలు చేస్తే.. టీడీపీ పోటీ చేయబోదని కూడా స్పష్టం చేసింది. ల్యాండ్ పూలింగ్‌లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే.. పేర్లు బయటపెట్టి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉంటామంది టీడీపీ. చంద్రబాబుపై కోపంతో అమరావతి రైతులపై కక్ష సాధించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. రాజధాని రైతులు, ప్రజల ఆందోళనకు నారా లోకేశ్ మద్దతు తెలిపారు. మంగళగిరిలో రైతులు, ప్రజా సంఘాలతో పాటు కాగడాలు పట్టుకుని నిరసన తెలిపారు. చంద్రబాబు అందరికీ ఆమోదయోగ్యమైన రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు జగన్ కూడా మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్.. అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారన్నారు నారా లోకేశ్.
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు మూడు రాజధానుల ప్రకటన చేశారంటూ మండిపడ్డారు ప్రత్తిపాటి పుల్లారావు. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధం కావాలన్నారు. రాజీనామాలు చేస్తే చరిత్రలో నిలిచిపోతారని, అలా చేస్తే టీడీపీ అభ్యర్థిని పోటీకి దించబోమని హామీ ఇచ్చారు.
మైండ్ గేమ్‌లో భాగంగానే అమరావతిపై మంత్రులతో మాట్లాడించారని పితాని సత్యనారాయణ అన్నారు. క్రిస్మస్ కానుకగా అమరావతిలోనే రాజధాని ఉంటుందని ప్రకటించి.. స్థాయి నిలబెట్టుకోవాలని సీఎంకు సూచించారు.
కుక్కను చంపాలంటే పిచ్చికుక్క అని ముద్ర వేసి చంపినట్లు.. అమరావతిని చంపాలని చూడటం తగదన్నారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ముంపు ముప్పు, నిర్మాణ ఖర్చులని చెప్పడం కేవలం సాకులు మాత్రమేనన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధమా అని సవాల్ విసిరారు.
7 నెలల్లో ఏ అభివృద్ధి పనులు చేయకుండా, ప్రజలను డైవర్ట్ చేయడానికి మూడు రాజధానుల ప్రతిపాదనలు తెచ్చారని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఆరోపించారు. జగన్ దెబ్బతో లులూ గ్రూప్, ఆదాని వంటి పెద్ద సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు స్పందించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని విమర్శించారు.
డిసెంబర్ 26న అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలతో గుంటూరులో మరోసారి సమావేశం అవుతామని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికను తిరస్కరిస్తూ తీర్మానం చేశారు. డిసెంబర్ 27న ఉదయం గుంటూరు జిల్లావ్యాప్తంగా నిరసనలు చేస్తామన్నారు.