హెరిటేజ్ నాదని నిరూపించలేకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా : జగన్ కు చంద్రబాబు సవాల్
సీఎం జగన్ పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ ఫ్రెష్ తనది కాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు.

సీఎం జగన్ పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ ఫ్రెష్ తనది కాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు.
సీఎం జగన్ పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ ఫ్రెష్ తనది కాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. హెరిటేజ్ తనదే అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. నిరూపించకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉండదని జగన్ కు సవాల్ చేశారు. ఉల్లి ధరలపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నిరూపించలేకపోతే జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తన సవాల్ ను స్వీకరించాలని సీఎంను డిమాండ్ చేశారు. సండూర్ కంపెనీ, భారతీ సిమెంట్స్ లా తాను మోసం చేయలేదన్నారు. ఉల్లి కోసం క్యూలైన్ లో నిలబడి ఓ వ్యక్తి గుండెపోటుతో చనిపోయారని అన్నారు. ఇదీ కూడా సహజ మరణమని వక్రీకరిస్తున్నారని తెలిపారు. వినియోగదారుడి జీవితంతో ప్రభుత్వం ఆడుకుంటుందని విమర్శించారు.
చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. శవాలపై కూడా రాజకీయం చేసేందుకు చంద్రబాబు అలవాటు పడిపోయారని తీవ్రంగా విమర్శించారు. 15 ఏళ్లుగా ఆ వ్యక్తికి గుండెపోటు ఉందని కుటుంబ సభ్యులే చెప్పారని తెలిపారు. ఆర్టీసీలో పని చేస్తూ వీఆర్ఎస్ తీసుకున్నారని చెప్పారు. అనవసరంగా తమను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. మృతుని కుటుంబ సభ్యులు బాధపడుతున్నారని తెలిపారు.