ఆర్టీసీ డ్రైవర్ ముబీన్ U turn: డ్యూటీ నుంచి మళ్లీ సమ్మెలోకి

  • Published By: madhu ,Published On : November 4, 2019 / 06:18 AM IST
ఆర్టీసీ డ్రైవర్ ముబీన్ U turn: డ్యూటీ నుంచి మళ్లీ సమ్మెలోకి

Updated On : November 4, 2019 / 6:18 AM IST

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారానికి 31వ రోజుకు చేరుకుంది. సీఎం డెడ్ లైన్‌తో పలువురు కార్మికులు జాబ్‌లోకి చేరుతున్నారు. తాను డ్యూటీలో చేరుతున్నట్లు..సమ్మతిపత్రం ఇచ్చిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎండీ ముబీన్ యూ టర్న్ తీసుకున్నారు. తాను సమ్మెలోకి వెళుతున్నట్లు..2019, నవంబర్ 04వ తేదీ సోమవారం ప్రకటించారు.

సీఎం వ్యాఖ్యలకు భయపడి ఉద్యోగంలో చేరుతున్నట్లు రిపోర్టు్ ఇచ్చినట్లు, కానీ..తనకు చనిపోయిన, సమ్మె చేస్తున్న కార్మికులు గుర్తుకు వచ్చారని వెల్లడించారు. డ్యూటీలో చేరడం సరికాదని భావించినట్లు తెలిపారు. అందుకే తాను సమ్మెలోకి వచ్చానన్నారు. 

ప్రభుత్వంలో ఆర్టీసీలో విలీనం చేయాలని, తదితర డిమాండ్లతో అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సమ్మె ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. చర్చలు జరిపినా..విఫలమయ్యాయి. హైకోర్టు దీనిపై విచారణ చేపడుతోంది. ఇటీవలే జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

నవంబర్ 05వ తేదీలోగా విధుల్లోకి చేరాలని డెడ్ లైన్ విధించారు. దీంతో కొంతమంది కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. డ్యూటీలో చేరిన ముబీన్..మళ్లీ సమ్మెలోకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
Read More : తొలి కార్తీక సోమవారం..కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు