సేవామిత్ర ఆధార్ చౌర్యం వల్ల చాలా డేంజర్

హైదరాబాద్: ఏపీలోని ప్రతి కుటుంబంలోని వ్యక్తియొక్క వివరాలను టీడీపీ చోరీ చేసిందని ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్ధితి అని వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో…సేవా మిత్ర యాప్ లోకి టీడీపీ వివరాలు ఎలా చౌర్యం చేసిందో వివరించారు. రాష్ట్రంలోని మహిళలు, ఆడపిల్లల వివరాలు అన్నీ టీడీపీనాయకుల చేతుల్లోకి వెళ్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ గవర్నమెంట్ రూపోందించిన “ఈ ప్రగతి” అనే పోర్టల్ ను ఆధార్ కార్డుకు లింక్ చేశారని, దాని ద్వారా ఆధార్ డేటాను సంక్షేమ పధకాల పేరుతో దొంగిలించారు. ఆధార్ డేటాలోని వ్యక్తుల యొక్క డేటాను “ఈ ప్రగతికి” తీసుకున్నారు. దాన్ని వేరే సాఫ్ట్ వేర్ ద్వారా డేటా కన్వర్ట్ చేసుకుని సేవామిత్రకు ట్రాన్సఫర్ చేసుకున్నారని విజయసాయి రెడ్డి వివరించారు. దీని ద్వారా మనుషుల కదలికలన్నీ ఐటీ గ్రిడ్స్ సంస్ధకు తెలుస్తుంటాయని ఆయన చెప్పారు. ఇప్పటికీ ఐటీ గ్రిడ్స్ యజమానిని పట్టుకోటానికి తెలంగాణ ప్రభుత్వం వెతుకుతూనే ఉందని ఆయన తెలిపారు.
సేవామిత్ర యాప్ లోకి కన్వర్ట్ అయిన డేటా ద్వారా మన ఫోన్ లో ఉన్న ఫోన్ నెంబర్లు, మీడియా ఫైల్స్, బ్యాంకు వివరాలు అన్నీ ఐటీ గ్రిడ్స్ సంస్ధవాళ్లు చూసి డిలిట్ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. బ్యాంక్ ఎకౌంట్ వివరాలు, బ్యాంక్ బ్యాలెన్స్ లు అన్నీ కూడా సేవా మిత్ర ద్వారా టీడీపీ నాయకుల చేతిలోకి వెళ్లిందని ఇది అత్యంత పమాదకర స్ధితి అని ఆయన చెప్పారు. ప్రతి ఫోన్ కు ఉన్న ఈఎమ్ఐఈ నంబరు ఉంటుంది. దాన్ని కూడా సేవా మిత్ర లో చౌర్యం చేశారని తద్వారా మీకదలికలన్నీ సేవామిత్ర ద్వారా ట్రేస్ చేస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : మోడీ,షా కోడ్ ఉల్లంఘన..ఈసీకి సుప్రీం నోటీసు