CM KCR Yadadri Tour : యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు యాదాద్రి ఆలయ పునః ప్రారంభ ఉత్సవాలలో పాల్గోంటారు.

CM KCR Yadadri Tour : యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్

Cm Kcr At Yadadri

Updated On : March 28, 2022 / 10:34 AM IST

CM KCR Yadadri Tour :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు యాదాద్రి ఆలయ పునః ప్రారంభ ఉత్సవాలలో పాల్గోంటారు.  ఈరోజు ఉదయం  ఆయన కుటుంబ సమేతంగా బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హలికాప్టర్ లో యాదాద్రికి బయలు దేరి….  పెద్ద గుట్టపై ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకున్నారు. అనంతరం  ఆయన ప్రధాన ఆలయం, పరిసరాల ఏర్పాట్లను పరిశీలించారు.
Also Read : Yadadri Temple : అద్భుత శిల్పకళా సౌందర్యం యాదాద్రి
యాదాద్రి చేరుకున్న  ముఖ్యమంత్రి  దంపతులు  ఉదయం 11.55 గంటలకు జరిగే మహాకుంభ సంప్రోక్షణ లో  పాల్గోంటారు. అనంతరం మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రధాన ఆలయ ప్రవేశం, స్వర్ణ ధ్వజస్తంభ సందర్శన చేస్తారు. 12.20 నుండి 12.30  వరకు శ్రీ స్వామివారి గర్భాలయ దర్శించుకుంటారు.