Ind vs NZ : న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 46 కే భారత్ ఆలౌట్.. 5 గురు బ్యాటర్లు డకౌట్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులకే కుప్పకూలింది.

Bengaluru test India 46 all out in first innings against New Zealand
IND vs NZ 1st Test : బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులకే కుప్పకూలింది. టీమ్ఇండియా బ్యాటర్లలో రిషబ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లు డకౌట్ కాగా.. రోహిత్ శర్మ (2) విఫలం అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ ఐదు వికెట్లు తీశాడు. విలియం ఒరోర్కే నాలుగు వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌతీ ఓ వికెట్ సాధించాడు.
టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండు రోజులుగా వర్షం కురవడంతో కవర్ల కిందనే పిచ్ ఉంది. ఈ రోజు ఉదయం కూడా కండిషన్లు పేసర్లు అనుకూలంగా ఉన్నప్పటికి రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకోవడం ఎంత తప్పో త్వరగానే అర్థమైంది.
కండిషన్లను సద్వినియోగం చేసుకున్న కివీస్ పేసర్లు రెచ్చిపోయారు. దీంతో 9 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక 8 ఏళ్ల తరువాత టెస్టుల్లో వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ, నాలుగో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ లు డకౌట్లు కావడంతో టీమ్ఇండియా 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.
నాలుగో వికెట్‌కు 21 పరుగులు జోడించిన తరువాత యశస్విని విలియం ఒరోర్కే ఔట్ చేశాడు. దీంతో అక్కడి నుంచి మొదలైన వికెట్ల పతనం వేగంగా సాగింది. స్వల్ప స్కోరుకే భారత్ పరిమితమైంది.
IND vs NZ : న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. శుభ్‌మన్ గిల్ ఎందుకు ఆడడం లేదో తెలుసా?