బ్రేక్ తర్వాత హార్దిక్ బెటర్ అయ్యాడు: కృనాల్

బ్రేక్ తర్వాత హార్దిక్ బెటర్ అయ్యాడు: కృనాల్

ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా తన తమ్ముడు హార్దిక్ పాండ్యా బ్రేక్ తర్వాత చాలా బెటర్ అయ్యాడంటున్నాడు. వరల్డ్ కప్‌కు ముందు తన తమ్ముడు ఇలా నైపుణ్యం సాధించడం శుభపరిణామం అన్నాడు. కాఫీ విత్ కరణ్ టీవీ షోలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పాండ్యా రెండు మ్యాచ్‌ల నిషేదంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. 

దాంతో పాటు అనారోగ్యం కారణంగా కొద్ది మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. ఈ విరామంలో హార్దిక్ ఆటలో చాలా మెరుగులు సాధించాడని కృనాల్ చెప్పుకొచ్చాడు. ‘ఆటకు దూరమైనంత కాలం మ్యాచ్‌లో పరిణతి సాధించేందుకే హార్దిక్ కష్టపడ్డాడు. ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా శ్రమించాడు. అతని లక్ష్యం ఒక్కటే ఎప్పటికప్పుడూ ఆటలో మెరుగు సాధించడం’

‘అప్పట్లో స్పిన్నర్ల బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనేవాడు. ఇప్పుడు ఫేసర్లపై కూడా అదే దూకుడుతో విజృంభిస్తున్నాడు. కానీ ఎప్పుడూ తన యాటిట్యూడ్ తగ్గించుకోలేదు. పైగా ప్రతి సంవత్సరం అది పెరుగుతూ వస్తుంది. నేను కూడా పాండ్యా నుంచి చాలా నేర్చుకుంటాను’ అని తమ్ముడి ప్రతిభను పొగిడాడు కృనాల్ పాండ్యా.