పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న హార్దిక్ పాండ్యా

  • Published By: vamsi ,Published On : June 1, 2020 / 01:39 AM IST
పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న హార్దిక్ పాండ్యా

Updated On : June 1, 2020 / 1:39 AM IST

భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తండ్రి కాబోతున్నాడు. తన కాబోయే భార్య నటాషా స్టాన్‌కోవిచ్‌ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పాండ్యా ఈ విషయాన్ని ప్రకటించాడు. జనవరి 1న దుబాయ్‌లో సెర్బియా నటి, మోడల్‌ అయిన నటాషా, పాండ్యాతో హార్దిక్‌ పాండ్యా నిశ్చితార్థం జరిగింది.

‘మా జీవితాల్లో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు మేమిద్దరం ఎదురుచూస్తున్నాం. మా జీవితంలోని కొత్త దశలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, దీవెనలు కావాలి. నటాషాతో నా ప్రయాణం గొప్పగా సాగుతోంది. మున్ముందు మా బంధం మరింత బలపడుతుంది’ అని నటాషాతో కలిసి దిగిన ఫొటోలను పాండ్యా పోస్ట్‌ చేశాడు. అయితే  హార్దిక్ పాండ్యా పెళ్లి అయినట్లుగా మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు.

ఇక హర్దిక్‌ పోస్ట్‌పై స్పందించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రీతో పలువురు క్రికెటర్లు‌ వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల ఆల్ రౌండర్ 2016లో భారత్‌ జట్టులోకి అడుగుపెట్టాడు. అప్పటి నుండి హార్దిక్ దేశం కోసం 40 టీ20లు, 54 వన్డేలు మరియు 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.
 

Read:  ఖేల్ రత్న అవార్డుకు రోహిత్ శర్మను నామినేట్ చేసిన BCCI