పెళ్లెప్పుడు బాబూ : లవర్‌ని తల్లిదండ్రులకు పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకున్నప్పటికీ విరామంలోనే ఉన్నాడు. ఈ గ్యాప్ లో హార్దిక్ తన పర్సనల్ లైఫ్ గురించి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కొద్ది రోజుల ముందు సినీ నటి నటాషా స్టాన్కోవిక్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అవి రూమర్లేనంటూ కొట్టిపారేసిన వారు ఉన్నారు.
గతంలో ఎల్లీ అవ్రామ్, ఊర్వశీ రౌటేలా, ఈషా గుప్తాల మాదిరిగానే ఇదీ అలాంటిదేనని లైట్ తీసుకున్నారు. కానీ, ఇటీవల హార్దిక్ పాండ్యా స్వయంగా తానే తల్లిదండ్రులకు నటాషాను పరిచయం చేయడంతో పెళ్లి కబురు త్వరలోనే వింటామంటూ మీడియా వర్గాలు చెబుతున్నాయి. దానికి పేరెంట్స్ నుంచి కూడా వ్యతిరేకత రాకపోవడంతో ఇక పెళ్లి ఫిక్స్ అని వార్తలు వస్తున్నాయి.
ముంబైకు చెందిన నటాషా ఓ సెర్బియన్ నటి, డ్యాన్సర్. బాలీవుడ్ లో సత్యాగ్రహ సినిమాలో నటించింది. బిగ్ బాస్ సీజన్ 8లోనూ కంటెస్టంట్ గా పాల్గొంది. షారూఖ్ ఖాన్, అనుష్క శర్మ జీరో మూవీలో అతిథి పాత్రంలో కనిపించింది. 4-5నెలల నుంచి విరామంలో ఉన్న పాండ్యా ఏ నిమిషంలో పెళ్లి గురించి చెబుతాడో మరి. లేదంటే కోహ్లీలాగే సైలెంట్ గా పెళ్లి చేసుకుని ఫొటోలు పంపిస్తాడో చూడాలి.