Chris Gayle : విండీస్ మాజీ క్రికెటర్‍‌పై విరుచుకుప‌డ్డ క్రిస్ గేల్‌

వెస్టీండీస్‌ మాజీ దిగ్గజ బౌలర్‌ కర్ట్‌లీ అంబ్రోస్‌పై యునివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Chris Gayle : విండీస్ మాజీ క్రికెటర్‍‌పై విరుచుకుప‌డ్డ క్రిస్ గేల్‌

Chris Gayle

Updated On : October 13, 2021 / 4:46 PM IST

Chris Gayle : వెస్టిండీస్ జట్టు మాజీ క్రికెటర్, ప్రస్తుత క్రికెటర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వెస్టిండీస్ తరపున ఆడి రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్ కర్ట్‌లీ అంబ్రోస్‌ తనను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని క్రిస్ గేల్ ఆరోపించారు. ఓ టీవీ షోలో పాల్గొన్న కర్ట్‌లీ తనను తక్కువ చేసి మాట్లాడారని గేల్ అన్నారు. తాజాగా టీవీ షోలో పాల్గొన్న కర్ట్‌లీ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో వెస్టిండీస్ తుది జ‌ట్టులో గేల్ ఆటోమేటిక్ చాయిస్ కాద‌ని అనడంపై గేల్ సీరియస్ అయ్యారు. తానేంటో తనకు తెలుసనీ.. ఇతరులు తన గురించి తప్పుగా మాట్లాడకుండా ఉంటే మంచిదని గేల్ సున్నితంగా హెచ్చరించారు.

చదవండి : T20 World Cup: మెంటార్‌గా ఉంటున్నందుకు ధోనీ పైసా తీసుకోవడం లేదు – జై షా

తాను క్రికెట్ లోకి వచ్చిన కొత్తలో కర్ట్‌లీని ఆదర్శంగా తీసుకున్నానని. అతడి గౌరవించేవాడినని తెలిపాడు గేల్. కానీ కర్ట్‌లీ ఏమైందో తెలియదు గత కొంతకాలంగా తనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చారు. ఇక ఇప్పుడు అత‌నిపై త‌న‌కెలాంటి గౌర‌వం లేద‌ని గేల్ స్ప‌ష్టం చేశాడు. మీడియా అటెన్ష‌న్ కోసమే ఇలా మాట్లాడుతున్నారని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు మీకు నేను చెబుతున్నాను. యూనివ‌ర్స్ బాస్ క్రిస్ గేల్‌కు అత‌డంటే అస్స‌లు గౌర‌వం లేదు. ఇదే విష‌యాన్ని మీరు అత‌నికి చెప్పండి అని ఓ టీవీ చానెల్ ఇంట‌ర్వ్యూలో గేల్ అన్నాడు.

చదవండి : ICC T20 World Cup 2021: భారీ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ.. ఎవరెవరికి ఎంతంటే?