IND vs NZ: అయ్యో.. ఆదేం ఆట సామీ.. కివీస్ బౌలర్ల దాటికి కుప్పకూలిన టీమిండియా టాప్ ఆర్డర్

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ లో భాగంగా శుక్రవారం రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే టీమిండియా..

IND vs NZ: అయ్యో.. ఆదేం ఆట సామీ.. కివీస్ బౌలర్ల దాటికి కుప్పకూలిన టీమిండియా టాప్ ఆర్డర్

IND vs NZ 2nd test

Updated On : October 25, 2024 / 11:39 AM IST

IND vs NZ 2nd test : భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ లో భాగంగా శుక్రవారం రెండో రోజు ఆట ప్రారంభమైంది. తొలిరోజు (గురువారం) తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 259 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైస్వాల్, శుభ్‌మ‌న్ గిల్ ఉన్నారు. 16 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండోరోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బిగ్ షాక్ తగిలింది.

Also Read: IND vs NZ : ముగిసిన తొలి రోజు ఆట‌.. రోహిత్ శ‌ర్మ డ‌కౌట్‌.. 243 ప‌రుగులు వెన‌క‌బ‌డిన భార‌త్‌

మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయింది. శుభ్‌మ‌న్ గిల్ (30) మిచెల్ శాన్‌ట్న‌ర్‌ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తరువాత యశస్వి జైస్వాల్ (30) పరుగులకు అవుట్ అయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ లో డారిల్ మిచెల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ దూకుడుగా ఆడే క్రమంలో 19 బాల్స్ ఎదుర్కొని 18 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

 

మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్ కూడా ఈ మ్యాచ్ లో స్వల్ప పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. 24 బంతులు ఆడిన సర్ఫరాజ్ 11 పరుగులుచేసి ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రవిచంద్ర అశ్విన్(4) మిచెల్ శాన్ ట్నర్ బౌలింగ్ ఎల్బీ డబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. మిచెల్ శాన్ ట్నర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.