విజృంభించిన టీమిండియా, కివీస్ టార్గెట్ 325

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శనతో అలరించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓవర్లు పూర్తయ్యేసరికి 324పరుగులు చేసి న్యూజిలాండ్‌కు భారీ టార్గెట్ ఇచ్చింది. పర్యటనలో భాగంగా జరిగిన తొలి వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో సాధించిన విజయం అనంతరం భారత్ రెండో వన్డేలోనూ అదే దూకుడును చూపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన ఆరంభాన్ని అదరగొట్టింది.
నిలకడగా బ్యాటింగ్ చేస్తూ కివీస్ జట్టుపై విరుచుకుపడింది. ఓపెనర్లు శుభారంభాన్ని నమోదు చేసి 154 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ల వికెట్లను టీమిండియా స్వల్ప వ్యవధిలో కోల్పోయింది. తొలుత రోహిత్ శర్మ 62 బంతుల్లో అర్థసెంచరీ సాధించగా.. శిఖర్ ధావన్ 53 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
బౌల్ట్ వేసిన 26వ ఓవర్ రెండో బంతికి ధావన్(66; 67 బంతుల్లో 9 ఫోర్లు).. వికెట్ కీపర్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆపై కొద్దిసేపటికి రోహిత్(87; 96 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫెర్గీసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి శతకాన్ని చేజార్చుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ కోహ్లి(17), అంబటి రాయుడు(84) ఉన్నారు. 33 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 196 పరుగులు చేసింది.
మొత్తంగా ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియాలో రోహిత్ శర్మ ప్రదర్శన ఇన్నింగ్స్ కే హైలెట్ గా నిలిచింది.