IND vs ENG 4th Test : ముగిసిన మూడో రోజు ఆట‌.. టీమ్ఇండియా 40/0

రాంచీ వేదిక‌గా భారత్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసింది.

IND vs ENG 4th Test : ముగిసిన మూడో రోజు ఆట‌.. టీమ్ఇండియా 40/0

IND vs ENG 4th Test

ముగిసిన మూడో రోజు ఆట‌..
192 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 40 ప‌రుగులు చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ (16), రోహిత్ శ‌ర్మ (24) లు క్రీజులో ఉన్నారు. భార‌త విజ‌యానికి ఇంకా 152 ప‌రుగులు అవ‌స‌రం.

ఇంగ్లాండ్ 145 ఆలౌట్‌.. 
టీమ్ఇండియా సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఐదు వికెట్ల‌తో విజృంభించ‌డంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 145 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. తొలి ఇన్నింగ్స్‌లో ల‌భించిన 46 ప‌రుగుల ఆధిక్యం క‌లుపుకుని టీమ్ఇండియా ముందు 192 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిలిపింది. భార‌త బౌల‌ర్ల‌లో అశ్విన్ కాకుండా కుల్దీప్ యాద‌వ్ నాలుగు వికెట్లు, జ‌డేజా ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. ఇంగ్లీష్ బ్యాట‌ర్లో ఓపెన‌ర్ జాక్ క్రాలీ (60) ఒక్క‌డే రాణించాడు.

ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసిన కుల్దీప్..
ఒకే ఓవ‌ర్‌లో కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 41వ ఓవ‌ర్ వేసిన అత‌డు మూడో బంతికి టామ్ హార్డ్లీ (7), ఆఖ‌రి బంతికి రాబిన్స‌ర్ (0) ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 133 ప‌రుగుల‌కు ఎనిమిది వికెట్లు కోల్పోయింది. బెన్‌ఫోక్స్ (6), షోయ‌బ్ బ‌షీర్ (0) లు క్రీజులో ఉన్నారు.

టీ విరామం.. 
మూడో రోజు ఆట‌లో టీ విరామ స‌మ‌యానికి ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి 120 ప‌రుగులు చేసింది. జానీ బెయిర్ స్టో (30), బెన్ ఫోక్స్ (0) లు క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ 166 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

జాక్ క్రాలీ ఔట్‌.. 
ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో జాక్ క్రాలీ (60) ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 28.1 ఓవ‌ర్‌లో 110 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

జాక్‌క్రాలీ హాఫ్ సెంచ‌రీ..
ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో సింగిల్ తీసి 71 బంతుల్లో జాక్ క్రాలీ అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. 25 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 99/3. జాక్ క్రాలీ (51), జానీ బెయిన్ స్టో (22) లు క్రీజులో ఉన్నారు. అంత‌క‌ముందు అశ్విన్ బౌలింగ్‌లో జోరూట్ (11) ఎల్బీగా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

వ‌రుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన అశ్విన్‌.. 
రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్‌కు అశ్విన్ ఒకే ఓవ‌ర్‌లో డ‌బుల్ షాకులు ఇచ్చాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవ‌ర్‌ను వేసిన అశ్విన్ ఐదో బంతికి డ‌కెట్ (15), ఆ మ‌రుస‌టి బంతికి ఓలీపోప్ (0)ల‌ను ఔట్ చేశాడు. దీంతో 19 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. 10 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 45 2. జాక్ క్రాలీ (25), జోరూట్ (5) లు ఆడుతున్నారు.

టీమ్ఇండియా 307 ఆలౌట్‌.. 
టీమ్ఇండియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 307 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్‌కు 46 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో ధ్రువ్ జురెల్ (90), య‌శ‌స్వి జైస్వాల్ (73) లు హాఫ్ సెంచ‌రీలు చేశారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో షోయ‌బ్ బ‌షీర్ ఐదు వికెట్లు తీశాడు. టామ్‌హార్డ్లీ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జేమ్స్ అండ‌ర్స‌న్ రెండు వికెట్లు సాధించాడు.

ధ్రువ్‌జురెల్ హాఫ్ సెంచ‌రీ..
టామ్ హార్డ్లీ బౌలింగ్‌లో సింగిల్ తీసి 96 బంతుల్లో అర్ధ‌శత‌కాన్ని అందుకున్నాడు ధ్రువ్‌జురెల్‌. టెస్టుల్లో అత‌డికి ఇదే తొలి హాఫ్ సెంచ‌రీ కావ‌డం విశేషం. 94 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 265 8. ధ్రువ్‌జురెల్ (59), ఆకాశ్ దీప్ (2) లు క్రీజులో ఉన్నారు.

నిల‌క‌డ‌గా ఆడుతున్న బ్యాట‌ర్లు..
ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను ధ్రువ్‌జురెల్‌, కుల్దీప్ యాద‌వ్‌లు స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటున్నారు. 82 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 240/7. ధ్రువ్ జురెల్ (39), కుల్దీప్ యాద‌వ్ (25) లు ఆడుతున్నారు.

ప్రారంభ‌మైన మూడో రోజు ఆట‌..
ఓవ‌ర్ నైట్ స్కోరు 219/7 తో మూడో రోజును భార‌త్ ఆరంభించింది. ఓవ‌ర్ నైట్ బ్యాట‌ర్లు ధ్రువ్‌జురెల్ (30), కుల్దీప్ యాద‌వ్ (17) లు క్రీజులో ఉన్నారు.