ODI World Cup 2023 Schedule : భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ తేదీతో సహా.. మరో ఆరు మ్యాచ్‌ల తేదీల్లోనూ మార్పులు..?
ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ లో మార్పు ఉంటుందని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. అక్టోబర్ 15న నవరాత్రుల మొదటి రోజు వస్తోంది. అటువంటి పరిస్థితుల్లో నవరాత్రి పండుగ కారణంగా తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐని కోరినట్లు తెలిసింది.

india vs pakistan match
ODI World Cup 2023 : ఐసీసీ పురుషుల వరల్డ్ కప్ టోర్నీ మరికొద్ది నెలల్లో భారత్ వేదికగా ప్రారంభం కానుంది. భారత్‌లోని మొత్తం పది మైదానాల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే ఐసీసీ మెగాటోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే, ఈ షెడ్యూల్‌లో తాజాగా మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ ఇటీవల విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, అహ్మదాబాద్‌లో నవరాత్రి ఉత్సవాలు కారణంగా అక్టోబర్ 15కు బదులుగా అక్టోబర్ 14న మ్యాచ్‌ను నిర్వహించనున్నారు.
IND VS WI 3rd ODI: చెలరేగిన బ్యాటర్లు.. విజృంభించిన బౌలర్లు.. మూడో వన్డేలో హైలెట్స్ ఇవే..
పాకిస్థాన్ – ఇండియా మ్యాచ్ తేదీని మార్పు చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుసైతం అంగీకరించింది. పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌సహా మొత్తం ఆరు మ్యాచ్‌ల షెడ్యూల్‌లోసైతం మార్పులు చోటు చేసుకోనున్నాయి. అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్ – శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, 12వ తేదీకి బదులుగా 10వ తేదీన, అదేవిధంగా హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 9న జరిగే న్యూజిలాండ్- నెదర్లాండ్స్ మ్యాచ్ తేదీని 12కి మార్పుచేసినట్లు తెలిసింది. అంతేకాక.. అక్టోబర్ 14న మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే ఇంగ్లాండ్ – ఆఫ్ఘానిస్థాన్ మ్యాచ్, అదేరోజు జరిగే న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ తేదీల్లోనూ మార్పు చేసేందుకు ఐసీసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, మార్పులు చేర్పులతో కూడిన కొత్త షెడ్యూల్‌ను బుధ, గురు వారాల్లో ఐసీసీ విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ లో మార్పు ఉంటుందని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. అక్టోబర్ 15న నవరాత్రుల మొదటి రోజు వస్తోంది. అటువంటి పరిస్థితుల్లో నవరాత్రి పండుగ కారణంగా తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐని కోరినట్లు తెలిసింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డుతో ఐసీసీ, బీసీసీఐ చర్చించిన తరువాత మ్యాచ్ ల నిర్వహణ తేదీల్లో మార్పులు చేర్పులు చేసినట్లు తెలిసింది.
షెడ్యూల్‌లో మార్పులు ఇలా ఉండే అవకాశం..
– భారత్ వర్సెస్ పాకిస్థాన్ (అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 14కు)
– పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక (అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 10వ తేదీకి)
– న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ (అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 12వ తేదీకి)
– ఇంగ్లాండ్ వర్సెస్ ఆప్ఘనిస్థాన్ (అక్టోబర్ 14 మధ్యాహ్నం నుంచి ఉదయంకు మార్పు)
– న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ (అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 15వ తేదీకి)
– డబుల్ హెడర్ డే నుంచి ఏదైనా ఒక మ్యాచ్ అక్టోబర్ 9కి మార్చబడుతుంది.
ODI World Cup 2023 Schedule