సన్ రైజర్స్ జట్టులో ఆంధ్రా కుర్రోడు

IPL 2020 : ఐపీఎల్ 20 మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. కరోనా కారణంగా…ప్రేక్షకులు బుల్లితెరకు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ టోర్నీలో కుర్రాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్లు తమ ప్రతిభాపాటవాలను చాటుతున్నారు. ఏదో ఒక జట్టులో చోటు దక్కాలని చాలా మంది ఆశిస్తుంటారు.
ఆంధ్రా యంగ్ మేన్ పృథ్వీరాజ్ కు సన్ రైజర్స్ జట్టులో ఆడే అదృష్టం దక్కింది. తనకు కాల్ వస్తుందని ఊహించలేకపోయానని వెల్లడించాడు. భువనేశ్వర్ స్థానంలో ఇతను ఆడనున్నాడు.
యూఏఈలో ఐపీఎల్ 2020 మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే..తొడ కండరాల గాయంతో భువనేశ్వర్ ప్రసాద్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించగా, అతడి స్థానంలో 22 ఏళ్ల ఎడమచేతి వాటం పేస్ బౌలర్ పృథ్వీరాజ్‌కు అవకాశం లభించింది. కరోనా కారణంగా జట్టుతో పాటే ‘బయో సెక్యూర్ ఎన్విరాన్‌మెంట్’ (బయో బబుల్)లో ఉంటున్నందున క్వారంటైన్‌తో పని లేకుండానే పృథ్వీరాజ్ జట్టులో ఆడనున్నాడు.
ఇక ఇతని విషయానికి వస్తే…పృథ్వీరాజ్ ఎడమ చేతి వాటం ఫాస్ట బౌలర్. ఇతను తెనాలి సమీపంలోని దుగ్గిరాలలో నివాసం ఉంటున్నాడు. తల్లి జంపాల కృష్ణకుమారి. విశాఖపట్టణంలో ఏపీ ఈడీపీసీఎల్‌లో జూనియర్ అకౌంట్స్ అధికారిగా చేస్తుండగా, తండ్రి యర్రా శ్రీనివాసరావు సివిల్ ఇంజినీరు/ ప్రభుత్వ కాంట్రాక్టరుగా పనిచేస్తున్నారు. విశాఖలో పెరిగిన పృథ్వీరాజ్ బిటెక్ చదువుకున్నాడు.
2011 నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి అండర్–14 నుంచి ఆంధ్రా జట్టుకు వివిధ వయసు విభాగాల్లో ఆడుతూ వచ్చాడు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్కూల్స్ జాతీయ పోటీలకు ఆడిన జట్టును కెప్టెన్‌గా నడిపించాడు. 2017 అక్టోబరులో 19 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్ లో రెండు ఇన్నిం
గ్స్ లలో ఆరు వికెట్లు, రెండో మ్యాచ్ లో మధ్యప్రదేశ్ పై ఆరు వికెట్లు తీయడం గమనార్హం. ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీలో ఇండియా రెడ్ టీమ్‌కు ఆడాడు. అదే ఏడాది బీసీసీఐ విజయ్ హజారే ట్రోఫీకి నేరుగా క్వార్టర్ ఫైనల్‌కి ఆడాడు.
గత సంవత్సరం ఐపీఎల్ వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం కొనుగోలు చేసినా..తుది 11 మంది జట్టులో స్థానం కల్పించలేదు. హైదరాబాద్ మ్యాచ్‌లో జట్టులో బెర్త్ దక్కటంతో, అదే మ్యాచ్‌లో మెయిడన్ వికెట్‌గా వార్నర్‌ను బౌల్డ్ చేసి వార్తల్లో నిలిచాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో ఇతను దిట్ట.