IPL 2023 : కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడిన బెంగళూరు

IPL 2023 : తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా.. 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది.

IPL 2023 : కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడిన బెంగళూరు

IPL 2023 (Photo : Google)

Updated On : April 6, 2023 / 11:30 PM IST

IPL 2023 : ఐపీఎల్ 2023 లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు చిత్తుగా ఓడింది. 81 పరుగుల తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా.. 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 17.4 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

బెంగళూరు బ్యాటర్లు ఫ్లాప్ షో ప్రదర్శించారు. విరాట్ కోహ్లి(21), డుప్లెసిస్(23), బ్రేస్ వెల్(19), డేవిడ్ విల్లే(20), ఆకాశ్ దీప్(17) పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 4 వికెట్ల పడగొట్టి ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. సుయాశ్ శర్మ 3 వికెట్లు, సునీల్ నరైన్ 2 వికెట్లు పడగొట్టారు. శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు.

Also Read..MS Dhoni Warning : అలా అయితే కెప్టెన్సీ వదిలేస్తా.. సీఎస్‌కే బౌలర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా.. భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు బాదింది. కోల్ కతా బ్యాటర్లలో శార్దూల్ ఠాకూర్, రహమానుల్లా గుర్బాజ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. శార్దూల్ ఠాకూర్ సుడిగాలి బ్యాటింగ్ చేశాడు. 29 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 9 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.

Also Read..IPL 2023: ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా 11వ సారి సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్

రహమానుల్లా 44 బంతుల్లో 57 రన్స్ చేశాడు. అతడి స్కోర్ లో 6 ఫోర్లు, 3 సిక్సలు ఉన్నాయి. రింకూ సింగ్ కూడా చెలరేగాడు. 33 బంతుల్లో 46 పరుగులు చేశాడు. 2 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. దాంతో కోల్ కతా భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లే, కర్ణ్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, బ్రేస్ వెల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.

ఈ సీజన్ లో కోల్ కతాకు ఇదే తొలి విజయం కాగా, బెంగళూరుకు తొలి ఓటమి. ఇప్పటివరకు ఈ సీజన్ లో ఇరు జట్లు రెండు మ్యాచులు ఆడాయి. ఒక దాంట్లో ఓటమి, మరొక దాంట్లో గెలుపు దక్కాయి. తన తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో కోల్ కతా ఓటమిపాలైంది. తన తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఆర్సీబీ గెలుపొందింది.

స్కోర్లు..
కోల్ కతా నైట్ రైడర్స్ – 20 ఓవర్లలో 204/7
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – 17.4 ఓవర్లలో 123 ఆలౌట్