IPL 2025 : లక్నోపై పంజాబ్ ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

Courtesy BCCI
IPL 2025 : ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో లక్నోపై గెలుపొందింది. 172 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలోనే ఛేదించింది. ప్రభుసిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సింగ్ 34 బంతుల్లో 69 పరుగులు చేశాడు. అయ్యర్ 30 బంతుల్లో 52 పరుగులు చేశాడు. వధేరా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 25 బంతుల్లో 43 పరుగులు చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పూరన్, బదోనీ రాణించారు. నిలోలస్ పూరన్ 30 బంతుల్లో 44 రన్స్ చేశాడు. ఆయుష్ బదోనీ 33 బాల్స్ లో 41 రన్స్ చేశాడు. అబ్దుల్ సమద్ 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 3 వికెట్లు తీశాడు.
Also Read : అప్పుడు ఆటో కోసం రూ.30 అడిగేవాడు.. ఇప్పుడు ఏకంగా రూ.30లక్షలు..
27 కోట్లు.. 17 పరుగులు.. పంత్ ఫ్లాప్ షో..
కాగా, లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. 5 బంతులు మాత్రమే ఆడి 2 పరుగులే చేసి ఔటయ్యాడు. పంత్ ఫ్లాష్ షో పై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. 27 కోట్లకు లక్నో పంత్ ని దక్కించుకుంది. ఈ సీజన్ లో పంత్ ప్రదర్శన పట్ల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాను ఆడిన మూడు మ్యాచులలో పంత్ చేసింది 17 పరుగులే. ఢిల్లీ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. హైదరాబాద్ మ్యాచ్ లో 15 పరుగులు చేయగా, పంజాబ్ తో జరిగిన పోరులో 2 పరుగులే చేశాడు. అటు కీపర్ గానూ, ఇటు కెప్టెన్ గానూ పంత్ ఆకట్టుకోవడం లేదని ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.