IPL2022 MI Vs KKR : ఆఖర్లో దంచికొట్టిన ముంబై.. కోల్‌కతా టార్గెట్ 162

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించాడు

IPL2022 MI Vs KKR : ఆఖర్లో దంచికొట్టిన ముంబై.. కోల్‌కతా టార్గెట్ 162

Ipl2022 Mi Vs Kkr

Updated On : April 7, 2022 / 9:41 PM IST

IPL2022 MI Vs KKR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 36 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. తిలక్ వర్మ (27 బంతుల్లో 38 పరుగులు-నాటౌట్), కీరన్ పొలార్డ్ (5 బంతుల్లో 22 పరుగులు-నాటౌట్) రాణించారు. డెవాల్డ్ బ్రెవీస్‌ (29) పరుగులు చేశాడు. చివర్లో పొలార్డ్ మూడు సిక్సులు బాదాడు. కోల్ కతా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. తొలుత 15 ఓవర్ల వరకు నెమ్మదిగా ఆడిన ముంబై బ్యాటర్లు ఆ తర్వాత వేగం పెంచారు. ఆఖరి 5 ఓవర్లలోనే 76 పరుగులు రాబట్టారు.(IPL2022 MI Vs KKR)

IPL 2022 Season 15: అలా చూస్తే మహేంద్ర సింగ్ ధోనీ.. దినేశ్ కార్తీక్ సమానమే

బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. తొలుత 15 ఓవర్ల వరకు నెమ్మదిగా ఆడిన ముంబయి బ్యాటర్లు ఆ తర్వాత కాస్త వేగం పెంచారు. ఆఖరి ఐదు ఓవర్లలోనే 76 పరుగులు రాబట్టారు. బ్యాటింగ్‌లో సూర్య కుమార్‌ యాదవ్‌ (52) అర్ధశతకంతో మెరిశాడు. డెవాల్డ్ బ్రెవీస్‌ (29) ఫర్వాలేదనించగా.. తిలక్‌ వర్మ (38*), కీరన్‌ పొలార్డ్ (22*) నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో ప్యాట్‌ కమ్మిన్స్‌ 2, ఉమేశ్‌ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్‌ తీశారు.

ఈ సీజన్ లో కోల్‌కతా ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో గెలుపొందింది. మరోవైపు, ఇప్పటివరకు ముంబై జట్టు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. ఈ మ్యాచులోనైనా బోణీ కొడుతుందేమో చూడాలి.

IPL 2022: మ్యాక్స్‌వెల్‌కు మసాజ్ చేసిన విరాట్ కోహ్లీ

తుది జట్ల వివరాలు..
కోల్‌కతా : అజింక్య రహానె, వెంకటేశ్ అయ్యర్‌, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), నితీశ్ రాణా, సామ్‌ బిల్లింగ్స్‌ (వికెట్ కీపర్‌), ఆండ్రూ రసెల్‌, సునీల్ నరైన్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌, ఉమేశ్ యాదవ్‌, రసిఖ్‌ సలాం, వరుణ్ చక్రవర్తి

ముంబయి : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, తిలక్‌ వర్మ, కీరన్‌ పొలార్డ్, డేనియల్ సామ్స్‌, డెవాల్డ్ బ్రెవీస్‌, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్‌, బాసిల్ తంపి