Jasprit Bumrah : స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చిన బుమ్రా..! నేపాల్‌తో మ్యాచ్‌కు దూరం.. మ‌ళ్లీ జ‌ట్టుతో క‌లుస్తాడా..?

నేపాల్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా (Team India) కు భారీ షాక్ త‌గిలింది. స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చాడు.

Jasprit Bumrah : స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చిన బుమ్రా..! నేపాల్‌తో మ్యాచ్‌కు దూరం.. మ‌ళ్లీ జ‌ట్టుతో క‌లుస్తాడా..?

Jasprit Bumrah Returns Home

Updated On : September 3, 2023 / 9:40 PM IST

Jasprit Bumrah Returns Home : నేపాల్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా (Team India) కు భారీ షాక్ త‌గిలింది. స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చాడు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో అత‌డు కొలంబొ నుంచి ముంబై చేరుకున్నాడు. అయితే.. ఆ ప్ర‌త్యేక కార‌ణం ఏంటి అన్న‌ది తెలియ‌రాలేదు. కాగా.. సూప‌ర్ 4లో భార‌త్ ఆడే మ్యాచ్ స‌మ‌యాని క‌ల్లా అత‌డు జ‌ట్టుతో క‌లవ‌నున్న‌ట్లు స‌మాచారం.

Virat Kohli : కోహ్లి కోస‌మే వ‌చ్చా.. నా గుండె ప‌గిలిపోయింద‌న్న‌ పాక్ యువ‌తి.. వీడియో వైర‌ల్

గ‌త కొన్నాళ్లుగా వెన్నునొప్పితో బాధ‌ప‌డిన బుమ్రా దాదాపు 11 నెల‌లు ఆట‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవ‌లే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో పున‌రాగ‌మ‌నం చేశాడు. రెండు మ్యాచుల్లో నాలుగు వికెట్లు తీసి స‌త్తా చాటాడు. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. ఆసియాక‌ప్‌తో పాటు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో కీల‌క పాత్ర పోషిస్తాడ‌ని ఫ్యాన్స్ ఎంతో ఖుషిగా ఉన్నారు.

Asia Cup 2023 : టీమ్ఇండియాపై వ‌రుణుడికి ఎంత ప్రేమో..! రావ‌ద్ద‌న్నా వ‌స్తున్నాడుగా..? నేపాల్‌తో మ్యాచ్ కూడా..

కాగా.. శ‌నివారం పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బుమ్రా బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. 14 బంతులు ఎదుర్కొని 3 బౌండ‌రీలు బాది 16 ప‌రుగులు చేశాడు. అయితే భార‌త ఇన్నింగ్స్ అనంత‌రం వ‌ర్షం రావ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. దీంతో బుమ్రాకు బౌలింగ్ చేసే అవ‌కాశం అయితే రాలేదు. ఇరు జ‌ట్ల‌కు అంపైర్లు చెరో పాయింట్‌ను కేటాయించారు. ఇక భారత జ‌ట్టు ఆసియా క‌ప్‌లో సూప‌ర్ 4 ధ‌శ‌కు అర్హ‌త సాధించాలంటే నేపాల్‌పై త‌ప్ప‌క గెల‌వాల్సిందే.