KKRvsSRH: హైదరాబాద్ టార్గెట్ 160

ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ మరో ఓటమికి దారితీసేలా కనిపిస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు సన్‌రైజర్స్ బౌలింగ్‌కు తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు 160పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. వరుస విరామాలతో వికెట్లు కోల్పోతూ వచ్చిన కోల్‌కతాను ఓపెనర్‌గా దిగిన క్రిస్ లిన్(51: 47 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సు)ఆదుకుని చివరి వరకూ నిలిచాడు.
జట్టులో లిన్‌దే అత్యధిక స్కోరు. మరో ఎండ్‌లో దిగిన ఓపెనర్ సునీల్ నరైన్(25; 8బంతుల్లోనే 3ఫోర్లు, 2సిక్సులు)బాదడంతో చక్కటి ఆరంభం నమోదైంది. కానీ, ఆ తర్వాత ఎవ్వరూ సరైన ఆటతీరు కనబరచకపోవడంతో తక్కువ పరుగులకే అవుట్ కావలసి వచ్చింది. శుభ్‌మాన్ గిల్(3), నితీశ్ రానా(11), దినేశ్ కార్తీక్(6), రింకూ సింగ్(30), ఆండ్రీ రస్సెల్(15), పీయూశ్ చావ్లా(4), యర్రా పృథ్వీ రాజ్(0), కేసీ కరియప్ప(9)పరుగులు మాత్రమే చేయగలిగారు.
నదీమ్ 3వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్ 2, సందీప్ శర్మ 1, రషీద్ ఖాన్1 మాత్రమే తీయగలిగారు.