IPL 2023, RCB vs KKR: బెంగళూరు చిత్తు.. కోల్‌కతా గెలుపు
IPL 2023, RCB vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతానైట్ రైడర్స్ విజయం సాధించింది.

kkr win
IPL 2023, RCB vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతానైట్ రైడర్స్ విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులకే పరిమితమైంది. దీంతో కోల్‌కతా 21 పరుగుల తేడాతో గెలిచింది. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లి(54; 37 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధశతకంతో రాణించినప్పటికి మిగిలిన వారు విఫలం అయ్యారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా సుయాష్ శర్మ, రస్సెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
IPL 2023, RCB vs KKR: బెంగళూరుపై కోల్‌కతా విజయం
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్లలో జేసన్ రాయ్(56; 29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకంతో అలరించగా నితీశ్ రాణా(48; 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. బెంగళూరు బౌలర్లలో హసరంగ, వినయ్‌కుమార్ రెండు వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.