IND vs SL T20 Postponed: పాండ్యాకు కరోనా.. రెండో టీ20 మ్యాచ్ వాయిదా!

భారత్‌, శ్రీలంకల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రేపటికి వాయిదా పడింది. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఈరోజు(27 జులై 2021) జరగాల్సిన మ్యాచ్‌ను రేపటికి వాయిదా వేశారు.

IND vs SL T20 Postponed: పాండ్యాకు కరోనా.. రెండో టీ20 మ్యాచ్ వాయిదా!

T20

Updated On : July 27, 2021 / 5:27 PM IST

IND vs SL T20 Postponed: భారత్‌, శ్రీలంకల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రేపటికి వాయిదా పడింది. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఈరోజు(27 జులై 2021) జరగాల్సిన మ్యాచ్‌ను రేపటికి వాయిదా వేశారు. మిగిలిన ఆటగాళ్లకు నెగటివ్ వస్తే మాత్రమే మిగిలిన మ్యాచ్‌లు జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్లేయర్స్ అందరూ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వాయిదా వేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది.

తొలి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా భారత్‌.. ఈ సిరీస్‌లో ముందంజలో ఉంది. అయితే, కరోనా ప్రభావం ఇప్పుడు ఈ సిరీస్‌కే ముప్పు వాటిల్లే ప్రమాదం తెచ్చింది. అంతకుముందు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్స్ లేకుండా కూడా శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత యువ జట్టు పర్యటనకు వెళ్లింది. ఈ జట్టుకు రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా ఉన్నారు.