T20 World Cup 2022: కోహ్లీ, సూర్యకుమార్‌ను చూసి పాక్ బ్యాట్స్‌మెన్ నేర్చుకోండి: పాక్ మాజీ క్రికెటర్

‘‘మంచి నైపుణ్యాలు ఉన్న బ్యాట్స్‌మన్ నుంచి నేర్చుకోవాలనుకుంటే విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోండి. నెదర్లాండ్ తో జరిగిన మ్యాచులోనూ కోహ్లీ నాటౌట్ గా నిలిచాడు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచుతో పాటు నెదర్లాండ్ తో జరిగిన మ్యాచులోనూ కోహ్లీ అద్భుతంగా సిక్సులు కొట్టాడు. ఈ టోర్నమెంటులోనే అద్భుత షాట్లు అవి. కోహ్లీ మంచి ఫాంలో ఉన్నప్పటికీ పరుగులు రాబట్టడానికి అనవసర తొందరపాటు ఏమీ పడలేదు’’ అని సల్మాన్ భట్ అన్నారు.

T20 World Cup 2022: కోహ్లీ, సూర్యకుమార్‌ను చూసి పాక్ బ్యాట్స్‌మెన్ నేర్చుకోండి: పాక్ మాజీ క్రికెటర్

Updated On : October 29, 2022 / 1:02 PM IST

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో ఆడిన మొదటి రెండు మ్యాచులూ ఓడిపోయింది పాకిస్థాన్. మొదటి మ్యాచులో టీమిండియాతో నాలుగు వికెట్ల తేడాతో పాక్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం చిన్న జట్టు జింబాబ్వేతో జరిగిన మ్యాచులోనూ ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో పాక్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు.

సరైన షాట్లు ఎలా ఆడాలన్న విషయంపై పాక్ కెప్టెన్ బాబర్ అజాం ఇతర బ్యాట్స్‌మెన్ టీమిండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ను చూసి నేర్చుకోవాలని అన్నారు. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజాం అగ్రస్థానాల్లో ఉన్నారు. అయితే, టీ20 ప్రపంచ కప్ లో మాత్రం వారికి తగ్గ ఆటతీరు కనబర్చడం లేదు.

‘‘మంచి నైపుణ్యాలు ఉన్న బ్యాట్స్‌మన్ నుంచి నేర్చుకోవాలనుకుంటే విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోండి. నెదర్లాండ్ తో జరిగిన మ్యాచులోనూ కోహ్లీ నాటౌట్ గా నిలిచాడు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచుతో పాటు నెదర్లాండ్ తో జరిగిన మ్యాచులోనూ కోహ్లీ అద్భుతంగా సిక్సులు కొట్టాడు. ఈ టోర్నమెంటులోనే అద్భుత షాట్లు అవి. కోహ్లీ మంచి ఫాంలో ఉన్నప్పటికీ పరుగులు రాబట్టడానికి అతడు అనవసర తొందరపాటు ఏమీ పడలేదు.

క్రీజులో ఓ ఆటగాడు రిస్కు తీసుకుని షాట్లు కొడుతుంటే మరో ఆటగాడు నిలకడగా ఆచితూచి ఆడాలి. రోహిత్ శర్మ క్రీజులో ధాటిగా ఆడుతున్నప్పుడు కోహ్లీ అదే పనిచేశాడు. నిజానికి వారిద్దరు ప్రపంచంలోనే టాప్ బ్యాట్స్‌మెన్. అయినప్పటికీ కోహ్లీ ఆచితూచి ఆడాడు. అనంతరం రోహిత్ శర్మ ఔట్ అయి సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాక కోహ్లీ తన బ్యాటింగ్ శైలి మార్చి ఆడాడు. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ను చూసి నేర్చుకోవాలి’’ అని సల్మాన్ భట్ చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..